Monthly Archives: June 2021

యూట్యూబ్‌లో ఇకపై ఆ యాడ్స్‌ కనిపించవు

ఫ్రీ మరియు ప్రీమియం ప్యాకేజీల ద్వారా వీడియో కంటెంట్‌ వినోదాన్ని అందిస్తున్న యూట్యూబ్‌ హర్షించదగ్గ నిర్ణయం తీసుకుంది. ఇకపై జూదం, మద్యం, రాజకీయాలకు సంబంధించిన యాడ్‌లను ప్రముఖంగా ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్‌ 14న యూట్యూబ్‌ మస్ట్‌హెడ్‌ (యూట్యూబ్‌ టాప్‌ పేజీ) కంటెంట్‌కు ఉండాల్సిన అర్హతల జాబితాను రిలీజ్‌ చేసింది.     గ్యాంబ్లింగ్‌, ఆల్కాహాల్‌, పాలిటిక్స్‌, డ్రగ్స్‌కు లింకు ఉన్న యాడ్‌లేవీ ఇకపై యూట్యూబ్‌ టాప్‌, హోం పేజీలో కనిపించవని ఆదివారం యూట్యూబ్‌ సంస్థ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. యూట్యూబ్‌ను ఓపెన్‌ చేయగానే ...

Read More »

సెకండ్‌ వేవ్‌లో రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నష్టం

కరోనా సెకండ్‌ వేవ్‌ జీవనోపాధిని చిధ్రం చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి మసకబారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) నెలవారీ బులెటిన్‌లో భాగంగా జూన్‌ వివరాలను వెల్లడించింది. ప్రాంతీయ-నిర్ధిష్ట నియంత్రణ చర్యలు, చిన్న గ్రామాలకు కూడా వైరస్‌ సోకడం వంటివి కారణాలుగా పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆశలు వ్యక్తమౌతున్నప్పటికీ సెకండ్‌ వేవ్‌తో ఇంకా భారత్‌ కుస్తీ పడుతూనే ఉందని ఆర్‌బిఐ అభిప్రాయపడింది. ప్రాథమికంగా దేశీయ డిమాండ్‌ను తీవ్రంగా ...

Read More »

కరోనాతో యాక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత!

నటుడు, సినిమాటోగ్రాఫర్‌ షమన్‌ మిత్రు (43) గురువారం చెన్నైలో కన్నుమూశారు. కోవిడ్‌ మహమ్మారి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ (డిఓపి)గా ఆయన పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. 2019లో తోరతి చిత్రంలో ఆయన గొర్రెల కాపరి పాత్రలో నటించారు. ఈ సినిమా గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గొర్రెల కాపరుల జీవితాలను ప్రతిబింబిస్తుంది. కాపరి పాత్రలో నటించాలంటే.. నటులు ఆ జీవనశైలికి తగ్గట్టుగా.. బరువు తగ్గాలి.. కొన్ని మైళ్ల దూరం గొర్రెల వెంట ...

Read More »

TRS ఎంపీ నామాకు ED సమన్లు

బ్యాంకు రుణాల మళ్లింపు వ్యవహారంలో తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నామాతో పాటు మధుకాన్‌ కేసులో నిందితులందరికి ఇడి సమన్లు పంపింది. జాతీయరహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాల కోసం మళ్లించినట్లు మధుకాన్‌ గ్రూప్‌పై ఇడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ...

Read More »

నాని నిర్మాణంలో ‘మీట్‌ క్యూట్‌’

వాల్‌ పోస్టర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై హీరో నాని నిర్మించిన అ, హిట్‌ వంటి సినిమాలు సూపర్‌ హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాని నిర్మాణంలో మీట్‌ క్యూట్‌ అనే సినిమా రూపొందుతుంది. ఈ విషయాన్ని నాని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నేడు కొత్త ప్రయాణం మొదలైంది. ఇది నాకెంతో ప్రత్యేకం..’ అంటూ మీట్‌ క్యూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశాడు. ఈ సినిమాలో సత్యరాజ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.

Read More »

అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో చిన్నారులకు ప్రత్యేక సదుపాయాలు

రాష్ట్రములో కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందోస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది.చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం పీడియాట్రిక్‌ అంశాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి ఏపిఐఐసి భవనం 6ఫ్లోర్‌ లోని కాన్ఫరెన్స్‌ హల్‌ లో మంగళవారం కోవిడ్‌ నివారణ గ్రూప్‌ అఫ్‌ మిమిస్టర్స్‌ సమావేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కమిటీ కన్వీనర్‌ ఆళ్ల నాని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ...

Read More »

సమంతకు అన్ని కోట్ల రెమ్యునిరేషనా..!

సమంత వెబ్‌సిరీస్‌లోనూ రాణిస్తోంది. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘ది ఫ్యామిలీ మేన్‌ -2’ వెబ్‌ సిరీస్‌లో ఆమె నటించిన రాజీ పాత్రకు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె రాజీ పాత్రలో నటించినందుకు గాను, అమెజాన్‌ డిజిటల్‌ సంస్థ సమంతకు నాలుగు కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ ఇచ్చిందని టాక్‌ వినిపిస్తోంది. కాగా.. ఇప్పుడు తాజాగా ఆమె మరో వెబ్‌ సిరీస్‌లో నటించడానికి సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌ను మరో డిజిటల్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించబోతుందని తెలుస్తోంది. అందులో భాగంగా సదరు డిజిటల్‌ సంస్థ సమంతకు ...

Read More »

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీకి సిద్ధం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్‌ సిద్ధమేనని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. సోమవారం అహ్మదాబాద్‌లోని నవ్రంగ్‌పురలో ఆప్‌ పార్టీ కార్యాలయాన్ని కేజ్రీవాల్‌ ప్రారంభించారు. కేజ్రీవాల్‌ సమక్షంలో ప్రముఖ పాత్రికేయుడు ఇసుదన్‌ గాద్వి ‘ఆప్‌’లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాల్లోనూ అప్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని, అందుకు ఆప్‌ సిద్ధంగా ఉందని అన్నారు. కాగా, కేజ్రీవాల్‌ అహ్మదాబాద్‌ రావడం ఈ ...

Read More »

మెగాస్టార్ మీద కేంద్రమంత్రి ప్రసంశల వర్షం

మెగాస్టార్‌ చిరంజీవిపై కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో చిరంజీవి, ఆయన బందం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌ రెడ్డి కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందించిన చిరంజీవి ”మీ దయగల మాటలకు ధన్యవాదాలు. నేను చేయగలిగిన చిన్న సహాయం మాత్రమే చేస్తున్నా” అంటూ రిప్లై ఇచ్చారు. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఎంతోమంది రోగులు ...

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అనాథ పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు

కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఫోన్లు తీసుకున్న అనంతరం.. అనాథ పిల్లలు ఏదైనా సాయం కోసం అధికారులను సంప్రదించవచ్చు. ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే కోవిడ్‌ బారినపడి తల్లిదండ్రులు మరణించడంతో 85 మంది పిల్లలు అనాథలయ్యారు. దీంతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన అనాథలు సైతం ఉన్నారని అధికారులు తెలిపారు. మొత్తం 138 మంది అనాథ పిల్లలున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.    అనాథ పిల్లల భద్రత దృష్ట్యా వారి సమస్యలను అధికారులు ...

Read More »