Monthly Archives: June 2021

మూడు సినిమాలతో రాబోతున్న నయనతార

నయనతార నటించిన మూడు సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కాబోతున్నట్టు సమాచారం. కరోనా మహమ్మారి ఉధృతి సమయంలోనూ ఈ లేడి సూపర్ స్టార్ నుంచి మూడు సినిమాలు రాబోతుండటం ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయట. అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారట. గత ఏడాది కరోనా సమయంలోనే ‘ముక్కుత్తి అమ్మన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అమ్మవారిపాత్రలో నయన్ బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా వరుసగా ...

Read More »

నారా లోకేష్‌పై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన సందర్భంలో పరామర్శ కోసం సూర్యారావుపేట కోర్టు సెంటర్‌కు నారా లోకేష్‌, కొల్లు రవీంద్రతో పాటు పలువురు టీడీపీ నేతలు వెళ్లారు. ఈ సమయంలో లోకేష్‌ కరోనా నిబంధనలు పట్టించుకోలేదని పలువురు ఆయనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎపిడమిక్‌ యాక్ట్‌ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ నారా లోకేష్‌, కొల్లు రవీంద్ర తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు, గతేడాది జూన్‌ 12న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ...

Read More »

కూతురు స్క్రిప్ట్‌తో సినిమా

‘లూసిఫర్‌’ తో నిర్మాతగా మారిన మాలీవుడ్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. తన ఏడేళ్ల కూతురు అలంకృత రాసిన స్క్రిప్ట్‌ బేస్‌ చేసుకుని రెండో సినిమా తీయబోతున్నట్లు చెప్పారు. ‘తండ్రీ కొడుకులు అమెరికాలో నివసిస్తుంటారు. రెండో ప్రపంచయుద్ధం ప్రారంభం కావడంతో వారిద్దరిని రెప్యూజీ క్యాంప్‌కు తరలిస్తారు అధికారులు. అక్కడ రెండు సంవత్సరాల పాటు ఉన్న తండ్రీ కొడుకులు వార్‌ ముగియడంతో తిరిగి ఇంటికి వచ్చి సంతోషంగా జీవిస్తుంటారు’. ఇది కూతురు రాసిన ...

Read More »

జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన జగన్‌

2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను సిఎం జగన్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించామన్నారు. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయని, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.50 లక్షలకు పైగా నిరుద్యోగులను భాగస్వామ్యం చేశామని సిఎం ...

Read More »

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌

ప్రముఖ కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తాజాగా.. శేఖర్‌కమ్ముల తన ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనుందని ఆయన వెల్లడించారు. లవ్‌స్టోరీ సినిమాను నిర్మించిన నిర్మాతలు నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌రావులే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ధనుష్‌ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రెయిట్‌ మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ ఎవరు? మిగతా నటీనటులు ఎవరనేది.. చిత్రబృందం త్వరలోనే ప్రకటించనుంది.

Read More »

అశోక్‌ గజపతిరాజు జైలుకెళ్లడం ఖాయం

అశోక్‌ గజపతిరాజుపై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్‌ గజపతిరాజు అంటూ ఆరోపించారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్‌ గజపతిరాజుపై గతంలో ఫోర్జరీ కేసు కూడా ఉందన్నారు. అశోక్‌ గజపతిరాజు జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం చైర్మన్‌ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని వెల్లడించారు. అశోక్‌ గజపతిరాజు విజయనగరం జిల్లాకు రాజులా ఫీలవుతున్నారన్నారు.

Read More »

యూట్యూబ్‌లో ఇకపై ఆ యాడ్స్‌ కనిపించవు

ఫ్రీ మరియు ప్రీమియం ప్యాకేజీల ద్వారా వీడియో కంటెంట్‌ వినోదాన్ని అందిస్తున్న యూట్యూబ్‌ హర్షించదగ్గ నిర్ణయం తీసుకుంది. ఇకపై జూదం, మద్యం, రాజకీయాలకు సంబంధించిన యాడ్‌లను ప్రముఖంగా ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్‌ 14న యూట్యూబ్‌ మస్ట్‌హెడ్‌ (యూట్యూబ్‌ టాప్‌ పేజీ) కంటెంట్‌కు ఉండాల్సిన అర్హతల జాబితాను రిలీజ్‌ చేసింది.     గ్యాంబ్లింగ్‌, ఆల్కాహాల్‌, పాలిటిక్స్‌, డ్రగ్స్‌కు లింకు ఉన్న యాడ్‌లేవీ ఇకపై యూట్యూబ్‌ టాప్‌, హోం పేజీలో కనిపించవని ఆదివారం యూట్యూబ్‌ సంస్థ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. యూట్యూబ్‌ను ఓపెన్‌ చేయగానే ...

Read More »

సెకండ్‌ వేవ్‌లో రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నష్టం

కరోనా సెకండ్‌ వేవ్‌ జీవనోపాధిని చిధ్రం చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి మసకబారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) నెలవారీ బులెటిన్‌లో భాగంగా జూన్‌ వివరాలను వెల్లడించింది. ప్రాంతీయ-నిర్ధిష్ట నియంత్రణ చర్యలు, చిన్న గ్రామాలకు కూడా వైరస్‌ సోకడం వంటివి కారణాలుగా పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆశలు వ్యక్తమౌతున్నప్పటికీ సెకండ్‌ వేవ్‌తో ఇంకా భారత్‌ కుస్తీ పడుతూనే ఉందని ఆర్‌బిఐ అభిప్రాయపడింది. ప్రాథమికంగా దేశీయ డిమాండ్‌ను తీవ్రంగా ...

Read More »

కరోనాతో యాక్టర్ కమ్ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత!

నటుడు, సినిమాటోగ్రాఫర్‌ షమన్‌ మిత్రు (43) గురువారం చెన్నైలో కన్నుమూశారు. కోవిడ్‌ మహమ్మారి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ (డిఓపి)గా ఆయన పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. 2019లో తోరతి చిత్రంలో ఆయన గొర్రెల కాపరి పాత్రలో నటించారు. ఈ సినిమా గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గొర్రెల కాపరుల జీవితాలను ప్రతిబింబిస్తుంది. కాపరి పాత్రలో నటించాలంటే.. నటులు ఆ జీవనశైలికి తగ్గట్టుగా.. బరువు తగ్గాలి.. కొన్ని మైళ్ల దూరం గొర్రెల వెంట ...

Read More »

TRS ఎంపీ నామాకు ED సమన్లు

బ్యాంకు రుణాల మళ్లింపు వ్యవహారంలో తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నామాతో పాటు మధుకాన్‌ కేసులో నిందితులందరికి ఇడి సమన్లు పంపింది. జాతీయరహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాల కోసం మళ్లించినట్లు మధుకాన్‌ గ్రూప్‌పై ఇడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ...

Read More »