Monthly Archives: July 2021

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అస్వస్థత

ఈటల రాజేందర్ ప్రజాదీవెన యాత్రకు తాత్కాలిక విరామం వచ్చింది. పాద యాత్ర 12వ రోజులలో భాగంగా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్న ఈటల అస్వస్థతకు గురవ్వడం నడవలేని స్థితిలో ఉండడంతో పాదయాత్రను కొండపాక లో నిలిపివేశారు. ఈటలకు వైద్యుల పరీక్షల్లో బీపీ 90/60, సుగర్ లెవెల్ 265 గా నమోదయ్యింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో వెంటనే పాదయాత్రను నిలిపి వేశారు. ఉన్నత వైద్యం కోసం ఈటలను హైదరాబాద్ తరలించాలని డాక్టర్స్ సలహా ఇచ్చారు. దాంతో ఈటల ను హైదరాబాద్ కి తరలించడానికి ఏర్పాట్లు ...

Read More »

జనవరి 14 న సంక్రాంతి కానుకగా “రాధేశ్యామ్”

ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా, కె.రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న పీరియాడిక్‌ లవ్‌స్టోరి ‘రాధే శ్యామ్‌’. ఈ చిత్రాన్ని జనవరి 14న సంక్రాతికి విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రభాస్‌ పోస్టర్‌ను విడదల చేసింది. 1960ల నాటి ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో నడిచే ఈ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్‌, ప్రేరణగా పూజా కనిపించనున్నారు. 2018లోనే అధికారికంగా ప్రకటించిన ‘రాధే శ్యామ్‌’ కరోనా, ఇతర అనేక కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇటీవలే హైదరాబాద్‌లో తిరిగి షూటింగ్‌ ప్రారంభించిన చిత్రబృందం చివరి ...

Read More »

ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడిగించిన జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 14 వరకూ నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.కాగా, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,107 మంది కరోనాబారినపడగా.. మరో 20 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,279 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.

Read More »

జూలై 31న మహేశ్‌ ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు త‌న `స‌ర్కారు వారి పాట‌` చిత్రంతో 2022 సంక్రాంతి బాక్సాఫీసు బరిలో నిలుస్తున్నట్లు అధికారికంగా వెల్లడించిన ఫ‌స్ట్ హీరో. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకాలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న `సర్కారువారిపాట’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ‘సర్కారువారి పాట’ సినిమాను ప్రకటించినప్ప‌టి నుండి ఈ ప్రాజెక్ట్‌పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘సర్కారువారి పాట’ టైటిల్, ఈ చిత్రంలో విడుదలైన మహేశ్‌బాబు ప్రీ ...

Read More »

జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల విడుదల

జగనన్న విద్యాదీవెన రెండో విడతగా రూ. 693 కోట్లు నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. విద్యార్ధుల తల్లుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేసినట్లు ప్రకటించారు. విద్యా దీవేన కానుక రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ… పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ బాగా చదువుకోవాలనేది తమ తాపత్రాయమని తెలిపారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన అనే మరో మంచి ...

Read More »

థియేటర్‌లో సినిమా వీక్షణ సురక్షితం

మాల్స్‌, పబ్బులకు వెళ్లి మాస్కులు తీసి ఎంజారు చేసే వాళ్ల కంటే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాళ్లే సురక్షితం!’ అంటూ హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యదేవ్‌ – ప్రియాంకా జవాల్కర్‌ జంటగా శరణ్‌ కొప్పిశెట్టి తెరకెక్కించిన ‘తిమ్మరుసు’ ప్రమోషనల్‌ కార్యక్రమంలో నాని పైవిధంగా కామెంట్‌ చేశారు. ఇంకా ‘చాలామంది పబ్బులు క్లబ్బులు మాల్స్‌కి వెళ్లి మాస్కులు తీసేసి మాట్లాడుతున్నారు. దానికంటే థియేటర్లలో కూచున్న ప్రేక్షకులు చాలా సురక్షితం.

Read More »

ఇకపై జగనన్న టౌన్‌షిప్‌లకు ప్రభుత్వ భూములు..!

 జగనన్న టౌన్‌షిప్‌లుగా ఇకపై ప్రభుత్వ భూములు వినియోగంలోకి రానున్నాయి. దేవదాయ, ధర్మాదాయ, విద్యాశాఖ, విద్యాసంస్థలు, వక్ఫ్‌, ఇతర ధార్మిక సంస్థల భూములు మినహా ఇంతవరకు ప్రభుత్వ వాడుకలో లేని ఖాళీ భూములను జగనన్న టౌన్‌షిప్‌లుగా వాడుకోనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ… రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి తాజాగా ఉత్తర్వులు (193) జారీ చేశారు. ప్రభుత్వ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూములను గుర్తించి జిల్లా కలెక్టర్‌ ముందుస్తుగా పొజిషన్‌ తీసుకొని పురపాలక శాఖకు అప్పగించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Read More »

1న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మొదటి పాట

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం)’. ఈ ఏడాది దసరా సందర్భంగా సినిమాను అక్టోబర్‌ 13న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘దోస్తీ..’ అంటూ సాగే తొలి పాటను ఫ్రెండ్‌షిప్‌ డేను పురస్కరించుకుని ఆగస్ట్‌ 1న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను ఐదు భాషల్లో హేమచంద్ర, అనిరుధ్‌, అమిత్‌ త్రివేది, విజయ్ యేసుదాస్‌, యాజిన్‌ నజీర్‌ ఆలపించారు. సముద్రఖని, అజయ్ దేవగణ్‌, ఆలియా భట్‌, ...

Read More »

కృష్ణా నదిలోభూకంపం..!.. ఉలిక్కిపడ్డ నల్లమల

ఎప్పుడూ లేని రీతిలో నల్లమలలోని కృష్ణా నదిలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో నల్లమల ప్రాంతంలోని పలు ఊర్లు ప్రభావానికి గురయ్యాయి. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఉదంతం అక్కడి వారిలో ఆందోళనకు గురి చేసింది. భూప్రకంపనల తీవ్రత 3.7గా గుర్తించారు. భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్రీశైల జలశయానికి పడమర వైపు 44 కి.మీ. దూరంలో.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు తూర్పున 18 కి.మీ. దూరంలో కృష్ణా నదిలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఏడు కిలోమీటర్ల ...

Read More »

యాక్ష‌న్ సీన్స్ లో నివేదా థామస్, రెజీనా

నివేదా థామస్, రెజీనా తొలిసారి యాక్షన్‌ స్టంట్స్‌ చేస్తున్నారు. కొరియ‌న్ మూవీ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌`కు రీమేక్‌గా తెలుగు సినిమా చేస్తున్నారు. అందులో వారు న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్‌ పిక్చర్స్ క‌లిసి నిర్మిస్తున్నాయి. డి.సురేశ్‌బాబు, సునీతతాటి, హ్యూన్యూ థామస్‌ కిమ్‌ కలిసి సౌత్‌ కొరియన్‌ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ను తెలుగు రీమేక్‌ను అధికారికంగా నిర్మించనున్నారు.

Read More »