Monthly Archives: August 2021

సుప్రీంకోర్టు చరిత్రలో నూతన ఘట్టం.. ఒకేసారి 9 మంది న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టుకు నూత‌నంగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులతో  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవలే సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర స‌ర్కారు గెజిట్‌ విడుదల చేసిన విష‌యం తెలిసిందే.   ఈ నేప‌థ్యంలోనే జడ్జిలుగా జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నం, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేశ్‌, జస్టిస్‌ ఏఎస్ ఓకా, ...

Read More »

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణ.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణను వేగవంతం చేసింది. మంగళవారం సినీ డైరెక్టర్‌ పూరీజగన్నాథ్‌ ఈడి విచారణకు హాజరయ్యారు. కుమారుడు ఆకాష్‌ పూరి, చార్టెడ్‌ అకౌంటెంట్‌ తో కలిసి పూరీజగన్నాథ్‌ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది. విదేశీ బ్యాంక్‌ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలను గుర్తిస్తే ‘ఫెమా’ కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది. ఈడీ వద్ద ఉన్న ఆధారాలకు ...

Read More »

పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇవాళ పతకాల పంట పండింది. సోమవారం ఒకేరోజు నాలుగు పతకాలు సాధించింది. ఇప్పటికే షూటింగ్‌లో బంగారు పతకం సాధించిన భారత్‌.. మరో మూడు మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నది. డిస్కస్‌ త్రోలో రజతం, జావెలిన్‌ త్రోలో రజతం, కాంస్య పతకాలు లభించాయి. డిస్కస్‌ త్రో ఎఫ్‌ 56 విభాగంలో యోగేశ్‌ కుతునియా రజత పతకం గెలుపొందాడు. ఇక జావెలిన్‌ త్రోలో దేవేంద్ర ఝజారియాకు రజతం లభించగా, సుందర్‌ సింగ్‌కు కాంస్యం గెలుపొందాడు. మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో ...

Read More »

”రాధేశ్యామ్‌” కొత్త పోస్టర్‌..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధేశ్యామ్. ఈ అద్భుతమైన ప్రేమ కథకు సంబంధించి “రాధే శ్యామ్” నిర్మాతలు ఈరోజు జన్మాష్టమి సందర్భంగా కొత్త పోస్టర్‌ ఆవిష్కరించారు. ప్రభాస్ పోస్టర్‌లో క్లాస్‌గా కనిపిస్తున్నాడు. పూజా హెగ్డే  చూపుతిప్పుకోనివ్వకుండా ఉంది. బ్లూ డ్రెస్ పై నెమలి పింఛం అలంకరణతో కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతున్నట్టుంది. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్టుంది.

Read More »

తమిళనాడు అసెంబ్లీలో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన సీఎం స్టాలిన్

కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టాలు రైతుల హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని, రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా ఈ చట్టాలను ఆమోదించిందని అన్నారు. వ్యవసాయాన్ని కార్పోరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి ఈ చట్టాలను రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ చట్టాలు వ్యవసాయ వృద్ధికి, రైతులకు సహాయపడవని అన్నారు. తమిళనాడు చరిత్రలో మొదటిసారిగా తమ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, రైతుల జీవనోపాధిని పెంచేందుకు వీలుగా ప్రత్యేకంగా ...

Read More »

దసరా బరిలో మహాసముద్రం

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘మహా సముద్రం’. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. అజరు భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 14న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఒక మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

Read More »

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తి

సుప్రీంకోర్టుకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా 9 మందిని నియమించాలంటూ సుప్రీం కొలీజియం చేసిన సిఫారసులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ఈ నియామకాలపై నోటిఫికేషన్లు కేంద్ర న్యాయశాఖ గురువారం జారీ చేసింది. ఈ నియమాకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీఎస్‌ నరసింహా న్యాయవాది నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులవుతున్నారు. ఇలా గతంలో 8 మంది న్యాయవాదులు నేరుగా సుప్రీంకోర్టు జడ్జిలయ్యారు. తాజాగా నియమితులైన నరసింహా అయోధ్య కేసులాంటి పలు సంచలన కేసుల్లో వాదించారు. ఈయనతోపాటు.. వయసు రీత్యా సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ ...

Read More »

బస్సులో సమంత, నయన్‌తార

స్టార్‌ కథానాయకులు సమంత, నయనతార నటిస్తున్న తమిళ చిత్రం కాతువకుల రెండు కాదల్‌ అనే సినిమా తెరకెక్కుతోంది. మక్కల్‌ సెల్వన్‌ విజయ్ సేతుపతి హీరో నటిస్తున్న ఈ చిత్రాన్ని నయన్‌ బాయ్ ఫ్రెండ్‌, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ వీడియో ఒకటి నెటింట్లో వైరల్‌గా మారింది. బస్సులో హీరో, హీరోయిన్లు ప్రయాణీస్తున్న ఈ సీన్‌ను పలువురు మొబైల్లో తీసి..సోషల్‌ మీడియాలో పెట్టడంతో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో సమంత, నయన్‌ ఇద్దరూ కూడా తెల్ల రంగు చీరలు కట్టుకుని బస్సు ఫుట్‌బోర్డుపై ఉండగా ...

Read More »

విశాఖలో విద్యార్థులపై కరోనా పంజా..

విశాఖలో పాఠశాల విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. నగరంలోని గోపాలపట్నం, ఎల్లపువానిపాలెం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లపువానిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు, కొత్తపాలెంకు చెందిన ఒక విద్యార్థి, సంతోష్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జివిఎంసి అధికారులు పాఠశాల ప్రాంగణం, విద్యార్థుల ఇళ్ల వద్ద శానిటేషన్‌ చేయించారు. కాగా, కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉండటం.. థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ...

Read More »

అక్కినేని పేరు తొల‌గింపుపై సమంత క్లారిటీ

అక్కినేని వారి కోడ‌లు, స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు చాలా పరిమితంగానే సినిమాల‌కు సైన్ చేస్తూ వ‌స్తున్నారు. చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు స‌మంత ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ, సోష‌ల్ మీడియాలోనూ  బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో సామ్ త‌నకు తానుగా కాంట్ర‌వ‌ర్సీలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్నారు. పెళ్లి త‌ర్వాత స‌మంత అక్కినేని అంటూ త‌న ఇన్‌స్టా ప్రొఫైల్ పేరును మార్చుకున్న ఈ అమ్మ‌డు రీసెంట్‌గా, అక్కినేని పేరుని తీసేసి, కేవ‌లం ‘ఎస్’ ...

Read More »