Monthly Archives: August 2021

చేనేత వేడుకల్లో మంత్రి నిర్మల సీతారామన్‌

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా పొందూరులో ఘనంగా నిర్వహించబోతోన్న చేనేత వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గోనబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిర్మలా సీతారమన్ నిన్న సాయంత్రమే విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఏపీ మంత్రులు, బీజేపీ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె విమానాశ్రయం నుంచి విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ కు వెళ్లారు.

Read More »

మోహన్‌బాబు ఇంట్లో మోహన్‌లాల్‌ కు విందు

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు, మలయాళీ సీనియర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ కు విందునిచ్చారు. స్నేహానికి ఎల్లలు లేవంటూ… వారంతా ఓ మినీ పార్టీ చేసుకున్నారు. ఈ ఫొటోలన్నీ మంచు లక్ష్మీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈమధ్య మలయాళ చిత్రాల షూటింగ్‌లు ఎక్కువగా హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. మలయాళీ నటులు కూడా అప్పుడప్పుడు తెలుగు వెండితెరపై కనులవిందు చేస్తున్నారు. మోహన్‌ లాల్‌ ఈ మధ్య ‘జనతా గ్యారేజ్‌’తో పాటు ‘మనమంతా’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. మమ్ముట్టి అయితే ‘యాత్ర’ చిత్రంలో నటించారు. ఈ ఇద్దరు ...

Read More »

దేశంలో మళ్లీ కరోనా పంజా..

భారతదేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పెరిగిన కేసులతో దేశంలో ఆందోళన వ్యక్తమౌతుంది. ఒకపక్క కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేసుల పెరుగుదల టెన్షన్‌ పుట్టిస్తోంది. గత 24 గంటల్లో 16,40,287 మంది నమూనాలను పరీక్షించగా.. 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిన్నటి కంటే దాదాపు 4 శాతం ఎక్కువ. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,18,56,757కు చేరుకుంది. ఇదే సమయంలో ...

Read More »

నా పుట్టిన రోజున ఆ పని చేయండి: మహేశ్‌

హీరో బర్త్‌డే అంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే హడావుడి చేస్తుంటారు అభిమానులు. కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేట్‌ చేయాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. భారీ కటౌట్‌లు ఏర్పాటు చేసి, వాటికి అభిషేకాలు చేస్తూ, కిలోల కొద్దీ కేక్స్‌ రెడీ చేయించి వాటిని కట్‌ చేస్తూ, స్వీట్లు పంచుతూ, డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక సోషల్‌ మీడియాలో అయితే ఫ్యాన్స్‌ చేసే హంగామాతో హీరో పేరు మార్మోగిపోతుంటుంది. కాగా మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 9న సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు బర్త్‌డే. అయితే ఈ సారి తనకో చిన్న పని ...

Read More »

జగనన్న పచ్చ తోరణం.. ఎయిమ్స్‌లో మొక్కలు నాటిన జగన్

జగనన్న పచ్చతోరణం పేరుతో వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంగళగిరిలోని ఎయిమ్స్‌ ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ(05 ఆగస్ట్ 2021) ఉదయం పదకొండున్నర గంటలకు ఎయిమ్స్‌ ఆవరణలో మొక్క నాటి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారభిస్తారు. అన్నీ జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్‌ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే ...

Read More »

20 నుంచి చిరు, చ‌ర‌ణ్ పై పాట చిత్రీక‌ర‌ణ‌

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. రెండు పాట‌ల షూటింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు చిత్ర నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Read More »

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా చరిత్ర సృష్టించాడు. బుధవారం 57 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో సెమీఫైనల్లో కజకిస్తాన్‌ రెజ్లర్‌ నూరిస్లామ్‌ సనయేవ్‌పై రవికుమార్‌ విక్టరీ బైఫాల్‌ కింద గెలుపొందాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఒక దశలో ప్రత్యర్థి నూరిస్లామ్‌ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమయంలో రవికుమార్‌ అతన్ని రింగ్‌ బయటకు తోసే క్రమంలో నూరిస్లామ్‌ కాలికి గాయమైంది. కాలికి కట్టుకొని మళ్లీ రింగులోకి వచ్చినా.. అతడు రవికుమార్‌ పట్టుకు నిలవలేకపోయాడు. దీంతో రిఫరీ రవికుమార్‌ను విక్టరీ బై ఫాల్‌ కింది ...

Read More »

దేవీ శ్రీప్రసాద్‌ దయాగుణం

ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్‌, ఆగస్టు 2న తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ గన్నవరం ‘డ్యాడీస్‌ హోమ్‌’ అనాథ చిన్నారుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఆడిపాడారు. వారిని ఎత్తుకొని ఆనందించారు. ‘మీ ప్రేమాభిమానాలకు వందనం. ‘డ్యాడీస్‌ హోమ్‌’ తల్లిదండ్రులు లేని వందలాది మంది చిన్నారుల బాగోగులు చూసుకుంటోంది. గతంలో సర్‌ ప్రైజ్‌ అంటూ నన్ను ఇక్కడికి తీసుకురాగా.. వాళ్ల కోసం అప్పట్లో సంగీతం వాయించాను. అప్పటి నుంచి వారితో కనెక్ట్‌ అయిపోయాను. ఈ ఆశ్రమంలోని కొందరు చిన్నారుల ...

Read More »

వైయస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు..అనుమానితుడు సునీల్‌ యాదవ్‌ అరెస్ట్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనుమానితుడు పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. గోవాలో సోమవారం అరెస్ట్‌ చేసిన అనంతరం అక్కడి స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. గోవా స్థానిక కోర్టు ద్వారా సునీల్‌ యాదవ్‌ను ట్రాన్సిట్‌ రిమాండ్‌లో ద్వారా కడప ...

Read More »

ఐదు భాషల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్

అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ లుక్ విడుదలైంది. పుష్పక్ నారాయణ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఎర్రచందనం అక్రమంగా తరలించే ముఠాకి చెందిన వ్యక్తి గా అయన ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ను విడుదల చేయనున్నారు. బన్నీ కెరీర్లో ఒకేసారి ఐదు భాషల్లో విడుదల కానున్న తోలి సినిమా ఇదే. అలాగే అడవి నేపథ్యంలో ...

Read More »