Monthly Archives: September 2021

బద్వేల్‌ ఉప ఎన్నికపై జగన్‌ ప్రత్యేక సమావేశం

బద్వేల్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య దాసరి సుధ కూడా డాక్టరేనని, తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామన్నారు. బద్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్‌ గుర్తు చేశారు. గతంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధకి రావాలని తెలిపారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని ...

Read More »

రానా, శర్వానంద్ ల మల్టీస్టారర్

హీరో రానా దగ్గుబాటి ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్‌ సినిమాల పైన ఆసక్తి చూపిస్తున్నట్లు కనబడుతుంది. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్‌’ చిత్రంలో నటిస్తూనే… ఇప్పుడు నటుడు శర్వానంద్‌తో కలిసి మరో మల్టీస్టారర్‌ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలోని నటీనటులను త్వరలోనే వెల్లడించనున్నారు.

Read More »

కరోనా వైరస్‌ ఇప్పట్లో పోదు : డబ్ల్యుహెచ్‌ఒ

వైరస్‌ ఆధీనంలో మనం ఉన్నాం అని కానీ, వైరస్‌ మన ఆధీనంలో ఉంది అని కానీ భావించవద్దని అంటున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆగేసియా ప్రాంతీయ డైరెక్టర్‌ పూనమ్‌ ఖత్రేపాల్‌ సింగ్‌ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని.. మరికొన్నేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. కానీ, ప్రజలపై టీకాల ప్రభావం, రోగనిరోధక శక్తి పెరగడం కారణంగా వైరస్‌ ఓ సాధారణ ఫ్లూలా మారే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కోవిడ్‌ బారిన పడి కోలుకున్నవారు, టీకాలు తీసుకున్న ...

Read More »

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న అనుష్క

అనుష్క.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెపై ఇప్పటికే ఎన్నో రూమర్స్‌ వచ్చాయి. ప్రధానంగా ప్రభాస్‌, అనుష్క పెళ్లి చేసుకుంటున్నారని వార్తలొచ్చాయి. ఆ వార్తలపై ప్రభాస్‌, అనుష్క ఇద్దరూ తామెప్పటికీ స్నేహితులుగానే ఉండిపోతామని.. వివాహం చేసుకోమని ఖరాఖండిగా చెప్పేశారు. ఆ తర్వాత అనుష్క దుబారుకి చెందిన ఓ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో కూడా నిజం లేదు. ఇక టాలీవుడ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కుమారుడితో ఆమె వివాహం చేసుకోకున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే ...

Read More »

హుజురాబాద్‌, బద్వేల్‌ నియోజకవర్గాల ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. షెడ్యూల్‌ వివరాలు.. ► అక్టోబర్ 1న ...

Read More »

“కొండా” దంపతులపై రామ్ గోపాల్ వర్మ సినిమా

రాంగోపాల్‌ వర్మ ‘కొండా’ పేరుతో కొత్త సినిమాను తీస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో కాంగ్రెస్‌ నేతలు కొండా మురళీధర్‌ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన వాయిస్‌తో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో త్వరలో షూటింగ్‌ ప్రారంభించనున్నారు. దర్శకుడు ఈ మధ్య కాలంలో మాజీ నక్సలైట్లు, పోలీసులను కలిసిన నేపథ్యంలో ఆసక్తికర విషయాలు తెలిసాయన్నారు. అప్పుడే ఈ సినిమా తీయాలన్న ఆలోచన కలిగిందన్నారు. ఈ సినిమా కోసం కొండా మురళిని కలిసినట్లు ఆయన ...

Read More »

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల తక్షణ సాయం : జగన్‌

యుద్ధప్రాతిపదికన గులాబ్‌ తుపాను సహాయక చర్యలను చేపట్టాలని ఎపి సిఎం జగన్‌ ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సిఎం జగన్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇప్పటికే శ్రీకాకుళంలో ఉన్న సిఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ను అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి ధర్మానకృష్ణదాస్‌ సిఎంకు వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని ...

Read More »

‘మా’ఎలక్షన్ నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్

మరో రెండు వారాల్లో ‘మా’ ఎన్నికలున్న వేళ… తాజాగా సోమవారం ఉదయం సినీనటుడు ప్రకాష్‌ రాజ్‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ ఎన్నికల నామినేషన్‌ వేశారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గా శ్రీకాంత్‌ కూడా నామినేషన్‌ వేశారు. నేటి నుంచి నుంచి ఈ నెల 29 వరకూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇస్తారు. అక్టోబర్‌ రెండో తేది సాయంత్రం ...

Read More »

సుప్రీంకోర్టు ఈమెయిల్స్‌లో ప్రధాని మోడీ యాడ్‌.. తొలగించాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం

 వచ్చే ఏడాది 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను ప్రోత్సహించడానికి కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇది ఆరు నెలల క్రితం మొదలు పెట్టగా.. పెద్ద యెత్తున ప్రచారం చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి అడ్వకేట్లకు వస్తున్న ఈ మెయిల్స్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోడీ ఫోటోలతో కూడిన యాడ్స్‌ రావడం ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తోంది. ఈ మెయిల్స్‌లో ఆయన చిత్రాలు రావడాన్ని కొంత మంది సీనియర్‌ అడ్వకేట్లు ధ్రువీకరించారు. ఈ చర్య ...

Read More »

భారీ బడ్జెట్‌తో ఇంటి సెట్‌ నిర్మాణం

 మహేష్‌ బాబు ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం దర్శకనిర్మాతలు ఒక పెద్ద ఇంటి సెట్‌ని సిద్ధం చేస్తున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎస్‌ ప్రకాష్‌ దాదాపు రూ.5 కోట్ల బడ్జెట్‌తో ఈ ఇంటి సెట్‌ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ...

Read More »