Monthly Archives: November 2021

12 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌

లోక్ సభ సమావేశాలు మొదలైన కాసేపటికే ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ ప్రారంభం కాగానే 12 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయడంతోపాటు లఖీంపూర్ ఖేరీ ఘటనపై సభలో చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. కేంద్రం ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. పన్నెండు మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే రాజ్య సభ చైర్మన్ దీనికి అంగీకరించకపోవడంతో ఇరు ...

Read More »

ఉన్నత స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డుకారాదు.. సీఎం జగన్

జగనన్న విద్యా దీవెన పథకం అమలులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. జగనన్న విద్యా దీవెన దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క పూర్తి ఫీజు రియింబర్స్‌మెంటే కాక, గత ప్రభుత్వ బకాయిలు రూ.1778 కోట్లతో కలిపి ...

Read More »

డిసెంబర్ 6న ‘పుష్ప’ ట్రైలర్ విడుదల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి మరో మేజర్ అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. అందులో అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా రూపొందుతోంది. రెండు భాగాలుగా వస్తున్నా ...

Read More »

సుమారు 13 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్‌ వైరస్‌

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సరికొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌పై భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే 12 దేశాలకు ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దక్షిణాఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణీకుల నుండి ఈ వైరస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. కఠినమైన ప్రయాణ నిబంధనలు ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి చెందడం ఆందోళనకరం. మాలావి రోడ్‌ నుండి టెల్‌ అవీవ్‌కు బస్సులో వచ్చిన ఓ ప్రయాణీకుడి ద్వారా ఓ కేసు వచ్చినట్లు ఇజ్రాయిల్‌ వెల్లడించింది. మరోవైపు కొత్త వైరస్‌ ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ...

Read More »

ఎఆర్‌. రెహమన్‌కి అరుదైన గౌరవం

43వ కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (సిఐఎఫ్‌ఎఫ్‌) వేదికపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్‌ రెహమన్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ఎఆర్‌.రెహమన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. సంగీత రంగంలో తాను చేసిన కృషికి గాను సిఐఎఫ్‌ఎఫ్‌ వేదికగా ప్రశంసలు కురిపించారని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, బాలీవుడ్‌ రంగాలతో పాటు హాలీవుడ్‌ వంటి విభిన్న చలనచిత్ర పరిశ్రమలలో అందించిన సంగీతంతో రెహమన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఫెస్టివల్‌లో దిగిన ఫొటోతో పాటు సినిమా, సిఐఎఫ్‌ఎఫ్‌ ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని ...

Read More »

తెలుగు వ్యక్తికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం

ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి చెన్నుపాటి జగదీశ్‌కు అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ సైన్స్ అకాడమీల్లో ఒకటైన ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ తదుపరి అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జగదీశ్  ప్రస్తుతం ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో భౌతికశాస్త్ర పరిశోధకుడిగా ఉన్నారు. నానో టెక్నాలజీలో నిపుణుడైన ఆయన మే 2022లో ఆస్ట్రేలియా అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

Read More »

టాలీవుడ్‌ హీరోలు, సెలబ్రిటీలకు రూ.200 కోట్లకు టోకరా.. వ్యాపారవేత్త శిల్ప అరెస్ట్‌..

అధిక వడ్డి ఇప్పిస్తానంటూ వందల కోట్ల రూపాయలు మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహరం బట్టబయలైంది. సినీ సెలబెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖునలు శిల్పా రూ. 100 నుంచి రూ. 200 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నార్సింగ్‌ పోలీసులు శిల్ప, ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్టు చేశారు. శిల్ప బాధితుల్లో టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు హీరోలు ఉండటం గమనార్హం. పేజ్‌ 3 పార్టీలతో సెలబ్రెటీలను ఆకర్షిస్తూ శిల్పా మోసపూరితంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో తాము ...

Read More »

శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా జకియాఖానమ్‌

 శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. కడప జిల్లా రాయచోటికి చెందిన వైసిపి ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా మాట్లాడుతూ మహిళల సంక్షేమ కోసం అనే పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ...

Read More »

ఇంటర్నేషనల్‌ మూవీలో సామ్‌

సమంత అభిమానులకు గుడ్ న్యూస్… సామ్ ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేసింది. అన్ని అడ్డంకులు, సరిహద్దులను చెరిపేసేందుకు మరో ప్లాన్ వేసింది. సౌత్ లో పాపులర్ అయిన సామ్ అందరికీ షాకిస్తూ బాలీవుడ్ బడా హీరోయిన్లకు సైతం దొరకని అవకాశాన్ని పట్టేసింది. తాజాగా సమంతా తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గతంలో ‘డోంటన్ అబ్బే’ చిత్రానికి దర్శకత్వం ...

Read More »

అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు

 ఆరో రోజు ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను మరో రెండు రోజులు ఈనెల 30 వరకు పొడిగించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారీటీ సంక్షేమంపై చర్చ జరగనుంది. ఆరోగ్యం, విద్య, రోడ్లపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరో మూడు బిల్లులను, ప్రభ్వుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆమోదించిన 9 బిల్లులను మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Read More »