Monthly Archives: December 2021

“F3” ఫన్ స్టార్ట్..స్పెషల్ లుక్ లో వెంకటేష్

 విక్టరీ వెంకటేష్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతూ “ఎఫ్ 3” మేకర్స్ సరికొత్త వీడియోను విడుదల చేశారు. వెంకటేష్ తన చుట్టూ ఉన్న వ్యక్తులతో చార్మినార్ ముందు విశ్రాంతి తీసుకుంటూ కనిపించడంతో రాజులా రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ సంస్కృతిని కన్విన్సింగ్‌గా ప్రదర్శించారు. స్పష్టంగా చిత్రంలోని ఒక పాట నుండి ఈ వీడియో క్లిప్ ను విడుదల చేసినట్టు కన్పిస్తోంది. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “ఎఫ్ 3” చిత్రం నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. మేకర్స్ వెంకటేష్ కు ...

Read More »

నీలి బెండపూడికి అభినందనలు తెలిపిన జగన్‌

పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నీలి బెండపూడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వైజాగ్‌ ఆంధ్ర యూనివర్శిటీ పూర్వవిద్యార్థి అయిన నీలి బెండపూడి.. ప్రతిష్టాత్మకపెన్సిల్వేనియా యూనివర్శిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులవ్వడం గర్వకారణమని సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Read More »

సమంతకు మరో అవార్డు

సమంత ఖాతాలో మరో అవార్డు వచ్చింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో లైంగిక వివక్షకు గురయ్యే రాజీ అనే తమిళ ఈలం సోల్జర్‌ పాత్రలో అద్భుతంగా నటించిన ఆమెకు ప్రశంసలతో పాటుగా అవార్డులు కూడా క్యూ కడుతున్నాయి. ఫిలిం ఫేర్‌ ఓటీటీ అవార్డ్స్‌-2021లో డ్రామా సిరీస్‌ (ఫీమేల్‌) కేటగిరీలో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు గెలుచుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్బోర్న్‌ (ఐఐఎఫ్‌ఎం-2021) అవార్డు కూడా వరించింది. బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఫిమేల్‌ (సిరీస్‌) కేటగిరీలో సమంత ...

Read More »

25కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో రెండు కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా నుండి వచ్చారు. తాజా కేసులతో కలిపి మొత్తం సంఖ్య 25కు చేరుకుంది. డిసెంబర్‌ 4న జింబాబ్వే నుండి ఓ వ్యక్తి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు రాగా, ఆయనకు చేపట్టిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. జినోమ్‌ స్వీకెన్స్‌లో ఒమిక్రాన్‌గా నిర్ధారణైంది. ఆయనతో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన వారికి పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. దక్షిణాఫ్రికా నుండి వచ్చిన వ్యక్తి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ ...

Read More »

ఈ ఏడాది అత్యధికంగా కోట్‌ చేసిన మహేష్‌ ట్వీట్‌

2021లో అత్యధికంగా కోట్ చేసిన మహేష్ ట్వీట్ అని తాజాగా ట్విట్టర్ అధికారికంగా తెలిపింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్-ఇండియా 2021 సంవత్సరానికి గానూ ఎంటర్టైన్మెంట్‌లో టాప్ ఇండియన్ ట్వీట్స్‌ను తాజాగా వెల్లడించింది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు పెట్టిన పోస్ట్ ఈ ఏడాది అత్యధికంగా కోట్ చేయబడిన ట్వీట్‌గా నిలిచింది.

Read More »

నీటి ప్రాజెక్టుల నిర్వహణ, భద్రతే ముఖ్యం : జగన్‌

రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఉదయం తన కార్యాలయ సంబంధిత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలనచేయాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణా పరిస్థితులు సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటినుంచి దీనిగురించి పట్టించుకోలేదన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణకోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్నదానిపై లెక్కలు తీయాలన్నారు. ...

Read More »

పుష్ప’ పాటలు కెరీర్‌కే చాలెంజ్‌ విసిరాయి

 అల్లు అర్జున్‌ , క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ సినిమా పుష్ప. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. ఇందులో మొదటి భాగం ‘పుష్ప’ (ది రైజ్‌) క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్‌, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్‌ కూడా సోషల్‌ మీడియాలో సంచలనం రేపింది. ఈ చిత్రంలోని ...

Read More »

గృహనిర్మాణశాఖపై జగన్‌ సమీక్ష

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌), గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో  సమీక్ష నిర్వహించారు.  ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని.. ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి అవగాహన కలిగించాలని సీఎం ఆదేశించారు. ఓటీఎస్‌ పథకం పురోగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. 22-ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని అధికారులు తెలిపారు. ఓటీఎస్‌ వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ ఫీజులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ ...

Read More »

థియేటర్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌

ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న‌ప్రేక్ష‌కులు అంద‌రు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించబోతున్నాడు జక్కన్న. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది. కానీ గేయ రచయిత ...

Read More »

మొట్టమొదటిసారి మహిళా కానిస్టేబుల్‌కు వీక్లీ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అవార్డ్‌

జాతీయ రహదారిపై దొంగతనానికి పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో తెగువ చూపిన మహిళా కానిస్టేబుల్‌ కు అవార్డును జిల్లా ఎస్పీ అందజేశారు. మహిళా కానిస్టేబుల్‌కు తేనీరు అందించి, ఆమె చూపిన తెగువకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కంచికచర్ల పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన దొంగతనం కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌-1577 టీ శివకుమారి కి మంగళవారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఐపీఎస్‌ వీక్లీ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అవార్డును అందజేశారు. ఈ అవార్డు పొందిన మొట్టమొదటి ...

Read More »