Monthly Archives: January 2022

ఎస్‌పివి ప్రతీకార రాజకీయాలు..వర్చువల్‌ సమావేశంలో మోడీ

అఖిలేష్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓటర్లను ప్రేరేపిస్తుందని మండిపడ్డారు. యుపిలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు చాలా దూరంగా ఉందని ఎస్‌పి చెబుతోందని అన్నారు. ఫేక్‌ సమాజ్‌వాద్‌.. పేదల ప్రభుత్వం మధ్య ఎన్నికలుగా ఆయన అభివర్ణించారు. పేదలకు ఇళ్లు, వెనుకబడిన వర్గాలకు పథకాలు, మెడికల్‌ కాలేజీలు, ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా కనెక్టివిటీ, ముస్లిం మహిళలకు కార్యక్రమాలు, మహిళలకు సంబంధించి వివిధ పథకాలు గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఈ రోజుల్లో.. ప్రజలు చాలా కలలుగంటున్నారు. ...

Read More »

విడుదలకు సిద్దమైన ట్యాక్సీ

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్‌ సజ్జా ట్యాక్సీస చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హెచ్‌ అండ్‌ హెచ్‌ ఎంటర్టెన్మెంట్స్‌ బ్యానర్‌ పై హరిత సజ్జా (ఎం.డి) నిర్మిస్తున్నారు. బిక్కి విజరు కుమార్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వసంత్‌ సమీర్‌ పిన్నమ రాజు, అల్మాస్‌ మోటివాలా, సూర్య శ్రీనివాస్‌, సౌమ్య మీనన్‌ , ప్రవీణ్‌ యండమూరి, సద్దాం హుస్సేన్‌, నవీన్‌ పండిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మార్క్‌ రాబిన్‌ సంగీతం అందిస్తుండగా ఉరుకుండారెడ్డి ఎస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆనంద్‌ ...

Read More »

ఎన్టీఆర్‌, వైఎస్సార్‌.. ఇద్దరికీ భారతరత్న ఇవ్వాలి : కొడాలి నాని

కృష్ణా జిల్లా గుడివాడలో కొత్తగా ఏర్పడిన విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన మంత్రి కొడాలి నాని.. ఎన్టీఆర్ వారసులం అని చెప్పుకునే సిగ్గుమాలిన వ్యక్తులు చేయలేని పని ముఖ్యమంత్రి జగన్ చేసి చూపించారని అన్నారు కొడాలి నాని.పద్నాలుగేళ్లు అధికారంలో ఉండి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కనీసం ప్రపోజల్ కూడా పెట్టలేని వ్యక్తులు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు నాని. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ...

Read More »

రెండు పార్ట్‌లుగా రాబోతున్న సలార్‌

ప్రభాస్‌ హీరోగా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ సలార్‌. ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్‌ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ‘బాహుబలి’, ‘పుష్ప’ వంటి చిత్రాల మాదిరిగా సలార్‌ కూడా రెండు పార్ట్‌లుగా రాబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మించడానికే మూవీ మేకర్స్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు చిత్రయూనిట్‌ స్పందించలేదు. అధికారకంగా ప్రకటించనూలేదు. త్వరలోనే చిత్రయూనిట్‌ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుందని సమాచారం. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ...

Read More »

అనంతపురంలోని 85గ్రామాల్లో జగనన్న పాల వెల్లువ

అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం అయింది. క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పాలు పోస్తున్న మహిళలే అమూల్‌కు యజమానులు అని.. ప్రైవేటు డైరీలు కన్నా.. ఎక్కవ రేటు ఇచ్చి అమూల్ పాలు కొనుగోలు చేస్తోందని వెల్లడించారు.

Read More »

సింగర్‌ కౌసల్యకు కరోనా

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ (Coronavirus) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. మూడో దశలో ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటున్నా.. వైర‌స్ ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా రాజ‌కీయ నాయకులు, సినీ స్టార్లు, ప‌లువురు సెల‌బ్రిటీలను క‌రోనా వెంటాడుతూనే ఉంటోంది. మూడో దశలో ఇప్ప‌టికే ఎంతో మంది వైర‌స్ బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ సింగర్ కౌసల్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

Read More »

సిటీజెన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ ను ప్రారంభించిన జగన్

 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు రూపొందించిన నూతన సాఫ్ట్‌వేర్‌ పోర్టల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఆవిష్కరించనున్నారు. సిటీజెన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ 2.0 కాసేపట్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తారు. ఒకే పోర్టల్‌ కిందకు వేర్వేరు శాఖల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే సచివాలయాల ద్వారా రెండేళ్లలో 3.47 కోట్ల సేవలు ప్రజలకు అందాయి. ఇంకాస్త వేగంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం నూతన సాఫ్ట్‌వేర్‌ పోర్టల్‌ను రూపొందించింది. 

Read More »

రామ్ చరణ్ తో మహానటి ‘నాటు’ స్టెప్పులు

రామ్ చరణ్ తో ‘మహానటి’  ‘నాటు.. నాటు…’ అంటూ స్టెప్పులేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇప్పుడీ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం హైదరాబాద్ లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న“గుడ్ లక్ సఖి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరిద్దరూ స్టెప్పులేసారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిన అనారోగ్యం కారణంగా చిరంజీవి రాలేకపోయారు. ఆయన స్థానంలో రామ్ చరణ్ ఈ వేదికకు విచ్చేసారు. రామ్ చరణ్ ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకనిర్మాతలను అభినందించారు. ఇక ఈ సినిమాకు ...

Read More »

ఏపీ ప్రజలకు గవర్నర్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 73 వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన రిపబ్లిక్‌ వేడుకల్లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, సిఎం జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసు దళాల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన జరిగింది. మొత్తం 16 శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ ...

Read More »

ఏపీలో ఘనంగా 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 73 వ గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో విజిటర్స్‌కు అనుమతి నిరాకరించారు.

Read More »