Monthly Archives: February 2022

నేడు ‘జగనన్న తోడు’ మూడో విడత రుణాల పంపిణీ

రోడ్ల పక్కన, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.

Read More »

సిఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి కేఎస్‌.జవహార్‌ రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు.

Read More »

ఆడవాళ్లు మీకు జోహార్లు

డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఇందులో శర్వానంద్ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఫస్ట్‌లుక్‌లు సినిమాకు మంచి పాజిటివ్‌ బజ్‌ను తీసుకొచ్చాయి. ఇందులో ఖుష్బు, రాధిక శరత్‌ కుమార్‌ వంటి సీనియర్‌ నటీమణులు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది ...

Read More »

రేపు విశాఖలో సిఎం జగన్‌ పర్యటన

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీశారదా పీఠం చేరుకుంటారు సీఎం. ఆ తర్వాత శ్రీశారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు సీఎం జగన్.

Read More »

26 నుంచి బిగ్‌బాస్‌

బుల్లితెర ప్రేక్షకులు కోసం బిగ్‌ బాస్‌ ఓటిటికి సమయం ఆసన్నమైంది. ‘బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌’ పేరుతో ప్రీమియర్‌ కానున్న ఈ షో తేదీని ప్రకటించేందుకు మేకర్స్‌ తాజాగా ప్రోమోను విడుదల చేశారు. బిగ్‌ బాస్‌ తెలుగు వెర్షన్‌ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. ఈ సరికొత్త డిజిటల్‌ సీజన్‌ గ్రాండ్‌ గా ప్రారంభమవుతుంది. ఇక ఇందులో దాదాపు 15 మంది పోటీదారులు పాల్గొననున్నారు. హోస్ట్‌ నాగార్జున అక్కినేని షోని శనివారం ప్రారంభిస్తున్నారు. షో హౌజ్‌ లోపల ఎలా ఉందన్న విషయాన్ని ఈ చిన్న ...

Read More »

మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ అరెస్ట్‌

మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) నేత నవాబ్‌ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) బుధవారం అరెస్టు చేసింది. ఈ కేసులో విచారించేందుకు ఉదయం 7 గంటలకు ఆయన నివాసానికి చేరుకున్న ఇడి అధికారులు గంటసేపు విచారించారు. అనంతరం ఇడి కార్యాలయానికి తీసుకెళ్లి సుమారు ఆరుగంటలసేపు ప్రశ్నించారు. ముంబయి అండర్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కార్యకలాపాలకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు చేసినట్లు ఇడి వర్గాలు తెలిపాయి. దావూద్‌తో సంబంధాలపై, అతని తరపున ఆస్తులు కొనుగోలు చేసినట్లు వచ్చిన ...

Read More »

త్వరలో మహేష్‌బాబు సోలో సాంగ్‌

 మహేష్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసరప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. పరశురామ్‌ పెట్లా రూపొందిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా నుండి కళావతి పాట విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. అయితే, సర్కారు వారి పాట నుండి అతి త్వరలోనే ఓ మాస్‌ బీట్‌ రాబోతుంది.అది టైటిల్‌ సాంగ్‌ అని సమాచారం. సంగీత దర్శకుడు థమన్‌ మంచి మాస్‌ ట్యూన్‌తో ...

Read More »

కడసారి చూపుకోసం..!- భారీగా తరలచ్చిన నేతలు, జనం

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కడసారి చూపుకోసం జనం బారులు తీరారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మరణించిన గౌతమ్‌రెడ్డి పార్థివదేహాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నేవీహెలికాప్టర్‌లో నెల్లూరుకు తరలించారు. ఉదయం 11.15 గంటలకు నగరంలోని పోలీసు పెరెడ్‌ గ్రౌండ్‌కు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో డైకాస్‌ రోడ్డులోని మేకపాటి అతిథి గృహానికి తరలించి ప్రజల సందర్శనార్ధం అక్కడ ఉంచారు. పార్థివదేహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు ...

Read More »

తమిళనాడు అర్బన్‌ ఎన్నికల్లో DMK ఘన విజయం

తమిళనాడులో జరిగిన అర్బన్‌ ఎన్నికల్లో డిఎంకె కూటమి ఘన విజయం సాధించింది. తమిళనాడు రాష్ట్రం మొత్తం 21 కార్పొరేషన్లు ఉండగా మొత్తం కైవసం చేసుకుంది. మొత్తం 138 మున్సిపాలిటీలకు గాను 132 డిఎంకె కూటమి, మూడు అన్నా డిఎంకె, మరో మూడు ఇతరులు గెలుపొందారు. ఎన్నికల ట్రెండ్‌లో స్పష్టమైన ఆధిక్యతతో డిఎంకె కూటమి ముందంజలో నిలిచింది. ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో భారీ మెజార్టీతో డిఎంకె కూటమి సొంతం చేసుకోవడంతో ఆ రాష్ట్రంలో ఆ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. డిఎంకె కూటమిలో భాగంగా సిపిఎం ...

Read More »

విజయ్ జోడీగా కియారా

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో లైగర్‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆగస్టు25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. అనంతరం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో హీరోయిన్‌ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా ఇప్పుడు విజరుతో జోడీ కట్టనుంది.

Read More »