Monthly Archives: February 2022

మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం 

 ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు.. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గౌతమ్‌రెడ్డి ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. వారం రోజుల దుబాయ్‌ పర్యటన ముగించుకొని.. నిన్ననే హైదరాబాద్‌ తిరిగి వచ్చారు గౌతమ్‌రెడ్డి.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గౌతమ్‌రెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలుపొందారు. ఆయన ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో రాష్ట్ర ...

Read More »

విశాఖ చేరుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పిఎఫ్‌ఆర్‌) సోమవారం జరగనుండడంతో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం నేవీ విమానాశ్రయం ఐఎన్‌ఎస్‌ డేగకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి తొలుత విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్‌, ఎంపి ఎ.విజయసాయిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. విమానాశ్రయ లాంజ్‌లో ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కొంతసమయం ...

Read More »

కళావతి పాటకు మహేష్ కూతురు సితార డాన్స్

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం  ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ కళావతి పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటికే 35మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతుంది.తాజాగా ఈ పాటకు మహేశ్‌ కూతురు సితార అదిరిపోయే స్టెప్పులేసింది. కమా కమాన్‌ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి’ అంటూ అచ్చం తండ్రిలా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన ...

Read More »

20న వైఎస్సార్‌, విశాఖ జిల్లాల్లో జగన్‌ పర్యటన

వైఎస్సార్‌ జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప చేరుకోనున్న సీఎం, అనంతరం పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు.ఆ తర్వాత కడప రింగ్‌ రోడ్‌ జయరాజ్‌ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం ఎస్‌బి.అంజాద్‌ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి నేవల్‌ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద భారత రాష్ట్రపతి ...

Read More »

ఓటీటీలో బంగార్రాజు

నాగార్జున, నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘బంగార్రాజు’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే థియేటర్‌ రన్‌ పూర్తి చేసుకున్న ‘బంగార్రాజు’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

Read More »

విజయవాడలో బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ను ప్రారంభించిన నితిన్ గడ్కరీ

 కేంద్ర సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో ట్రాఫిక్‌ సమస్యను తొలగించడానికి బెంజ్‌ సర్కిల్‌ వద్ద మరో ఫ్లై ఓవర్‌ను గడ్కరీ సహకారంతో వేగంగా పూర్తి చేశామని సిఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో వేగంగా పనులు, భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో వేగంగా నిర్ణయాలు ...

Read More »

అదనపు ఆదాయం కోసం అధికారులతో సిఎం చర్చలు

అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్యం, ఎక్సైజ్‌, అటవీ, పర్యావరణం, గనులశాఖలపై సిఎం బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రం సొంత ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి సారించాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో పద్ధతులను పరిశీలించాలని కోరారు. రాష్ట్రం సొంత ఆదాయం పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలని, వాటిని కార్యరూపంలోకి తీసుకురావడంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించేందుకు సంబంధిత ...

Read More »

నాని, కీర్తి కాంబినేష‌న్‌లో `దసరా` చిత్రం షురూ!

శ్యామ్ సింఘ రాయ్ విజయంతో వున్న నాని ఇప్పుడు మొద‌టిసారి శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో ద‌స‌రా చిత్రం చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఆధ్వర్యంలో దసరాకు ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. క‌థానాయిక‌గా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ న‌టించ‌నుంది. దసరా చిత్రం ఈరోజు (బుధ‌వారం నాడు) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిధులుగా సుకుమార్, తిరుమల కిషోర్, వేణు ఉడుగుల, శరత్ మండవ హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు శ్రీకాంత్ తండ్రి చంద్రయ్య కెమెరా ...

Read More »

గౌతమ్‌ సవాంగ్‌ బదిలీ: నూతన డిజిపిగా కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి

రాష్ట్ర డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటిలిజెన్స్‌ డిజిగా ఉన్న కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డిని నూతన డిజిపిగా నియమితులైనారు. మంగళవారం ఉదయం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జులై వరకు గౌతమ్‌ సవాంగ్‌కు పదవీ కాలం ఉనుప్పటికీ అకస్మికంగా ఆయనుు బదిలీ చేయడం, ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఆయన స్థానంలో నియమితులైన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి డిజిపిగా పూర్తి అదనపు బాధ్యతలు ...

Read More »

ప్రభాస్‌ జోడీగా శ్రీలీల!

 ప్రభాస్‌, మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అవి నిజమేనంటు దర్శకుడు ఒప్పుకున్నారు. అంతేకాకుండా ‘రాజా డీలక్స్‌’ అనే తాత్కాలిక టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్‌ హీరో సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ‘పెళ్లి సందడి’ హీరోయిన్‌ శ్రీలీల ప్రభాస్‌తో కలిసి స్క్రీన్‌ స్పేస్‌ను పంచుకోనున్నారు.

Read More »