Monthly Archives: March 2022

భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు : జగన్‌

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ఎపి సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ‘జగనన్న శాశ్వత భూ హక్కుాభూ రక్ష ‘ పథకంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పథకానికి సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈసందర్భంగా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన డ్రోన్‌ను పరిశీలించారు.అనంతరం జగన్‌ మాట్లాడుతూ గతంలో వెబ్‌ ల్యాండ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే కాకుండా ఫిజికల్‌ రికార్డులను కూడా తయారు చేయాలన్నారు. ఫిజికల్‌ డాక్యుమెంట్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని సీఎం ...

Read More »

కొరటాలతో ‘ఎన్‌టిఆర్‌ 30’

టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ‘ఎన్టీఆర్‌ 30’కి సంబంధించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఘన విజయంపై అందరికీ ధన్యవాదాలు తెలిపే మీడియా ఇంటరాక్షన్‌ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఎన్టీఆర్‌ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేస్తానని, జూన్‌లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని చెప్పారు. షూటింగ్‌ ప్రారంభించడానికి చాలా సమయం ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనిని ప్రారంభిస్తానన్నారు. ఆ సినిమా కోసం బరువు తగ్గబోతున్నారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఫైనల్‌ స్క్రిప్టు గురించి ఎన్టీఆర్‌, కొరటాల ...

Read More »

ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రాజమౌళి, మహేష్‌ కాంబో..!

త్వరలో రాజమౌళి, మహేష్‌ కాంబోలో రాబోయే చిత్రంపై రచయిత విజయేంద్రప్రసాద్‌ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహేష్‌ సినిమా కోసం ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ కథను తీసుకోవాలి అనే ఆలోచనఉంది. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్‌పై దృష్టి సారిస్తారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే భారతదేశపు మొట్ట మొదటి యాక్షన్‌ అడ్వెంచర్‌ అవుతుంది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న’ట్టు ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ 2023 ప్రారంభంలో సెట్స్‌ పైకి ...

Read More »

యుపి సిఎంగా యోగి ప్రమాణం

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరోసారి యోగి ఆదిత్యనాధ్‌ ప్రమాణ స్వీకారం చేశారు.. ఆయనతో గవర్నర్ ఆనందీ బెన్ పాటిల్ ప్రమాణం చేయించారు.  లక్నోలోని వాజ్ ఫేయి స్టేడియంలో శుక్రవారం సాయంత్రం భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, 37 ఏళ్ల తర్వాత అక్కడ రికార్డు నెలకొంది. ఐదేళ్ల  పదవీకాలాన్ని పూర్తి చేసి, రెండవ దఫా ...

Read More »

నాగచైతన్య – వెంకట్‌ ప్రభు మూవీ ఫిక్స్‌

నాగ చైతన్య నటించిన థాంక్యూ, బాలీవుడ్‌ మొదటి సినిమా లాల్‌ సింగ్‌ చద్దా రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇటీవలే డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన చైతూ ‘దూత’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇది షూటింగ్‌ దశలో ఉంది. ఈ క్రమంలోనే నాగ చైతన్య తమిళ దర్శకుడితో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నాడు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్‌ ప్రభు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ సినిమాలో చైతూ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. అంతేకాదు, పరశురామ్‌ పెట్లా, విజరు ...

Read More »

‘పెగాసస్‌’ పై సభా కమిటీ : స్పీకర్‌ ప్రకటన

కొద్దినెలల క్రితం జాతీయస్థాయిలో తీవ్ర కలకలం రేపిన పెగాసస్‌ స్ఫైవేర్‌ అంశం తాజాగా రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు వచ్చింది. స్పైవేర్‌ను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన ప్రకటనపై అధికార వైసిపి సభ్యులు ఉభయసభల్లోనూ విచారణకు డిమాండ్‌ చేశారు. ఆ సంస్థ ప్రతినిధులు తమను సంప్రదించింది నిజమేకానీ, తాము కొనుగోలు చేయలేదని అప్పటి ఐటి శాఖ మంత్రి లోకేశ్‌ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. వీరిరువురి ప్రకటనలతో విదేశాలకు చెందిన పెగాసస్‌ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా స్పైవేర్‌ను అమ్మడానికి ...

Read More »

అమృత్‌సర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సినిమా పేరు ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ సయమం దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ నెల 19న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో గ్రాండ్‌గా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్‌. ఆదివారం గుజరాత్‌లోని బరోడా, ఢిల్లీలో ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టింది. సోమవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది చిత్రబృందం. సినిమా మంచి విజయం సాధించాలని అక్కడి గోల్డెన్‌ టెంపుల్‌లో ...

Read More »

ఏప్రిల్‌ 2 నుంచి భారత్‌లో ఇజ్రాయిల్‌ ప్రధాని పర్యటన

ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి నఫ్తలి బెన్నెట్‌ ఏప్రిల్‌ 2 నుంచి నాలుగురోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలు 30వ వార్షికోత్సవాన్ని నిర్వహించకుంటున్న సందర్భంగా ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు నఫ్తలి బెన్నెట్‌ భారత పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆవిష్కరణలు, సాంకేతికత, భద్రత, సైబర్‌, వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంగానూ ఈ పర్యటన జరగనుంది. ఈ వివరాలను ఇజ్రాయిల్‌ ప్రధాని విదేశీ మీడియా సలహాదారు ఒక ప్రకటనలో తెలిపారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం ...

Read More »

పెరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్‌ ధరలు

పీ, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ సినిమా టికెట్‌ ధరలను పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలైనప్పుడు ఐదో ఆటకు అనుమతినివ్వడంతోపాటు, వారం పదిరోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతమున్న టికెట్‌ ధరలపై ప్రతి టికెట్‌కు రూ. 50 (మల్టీప్లెక్స్‌లో రూ. 100)పెంచుకునేలా థియేటర్లకు వెసులుబాటు కల్పించింది. అయితే ఈ ధర కేవలం మూడు రోజులు మాత్రమే. ఆ తర్వాత మూడు రోజులు రూ. 30 ...

Read More »

ఇళ్లు కాదు…ఊళ్ళే కడుతున్నాం : జగన్‌

రాష్ట్రంలో చేపట్టిన జగనన్న కాలనీల పథకం ద్వారా కేవలం ఇళ్లు కట్టడం లేదని, ఊళ్ల నిర్మాణమే జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గృహనిర్మాణ శాఖపై గురువారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 13వేల పంచాయతీల్లో 17,005 కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పారు. జగనన్న కాలనీ మొదటి దశలో భాగంగా 15.60లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రతి ఎంఎల్‌ఏ తల ఎత్తుకుని తిరిగేలా ఈ పనులు సాగుతున్నాయని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న పనులు చూసి ...

Read More »