Monthly Archives: March 2022

నా సక్సెస్‌కు కారణం సురేఖ

మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ టాలీవుడ్‌ నటుడు చిరంజీవి తన బ్లడ్‌బ్యాంకులో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు చిరంజీవి. తన భార్య సురేఖ గురించి, ఆవిడ వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘కుటుంబంపై బాధ్యతలు తీసుకుం టున్న మహిళలకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్త్రీలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అందుకు మనమెంతో గర్వించాలి. వాళ్లు ఎదగడానికి మనవంతు ...

Read More »

ఈనెల 25 వరకు ఎపి అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 25 వరకు ఎపి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని శాసనసభ వ్యవహారాల కమిటీ (బిఎసి) నిర్ణయించింది. మొత్తం 13 రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా టిడిపి సభ్యులు గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై సిఎం జగన్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘ గవర్నర్‌ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదు ‘ వయస్సులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదని సిఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ముఖ్యమంత్రి జగన్‌ టిడిపి నేత అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. మరోవైపు వెలగపూడిలోని ...

Read More »

మరో వివాదంలో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ

జక్కన్న మ్యాగమ్‌ ఓపస్‌ మూవీ ”ఆర్‌ఆర్‌ఆర్‌” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్‌ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ స్క్రీన్‌ స్పేస్‌ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కొమరం భీమ్‌ గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ నేత రామకఅష్ణ నిర్మాతలపై మండిపడ్డారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను డిజైన్‌ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని అన్నారు. నిజ జీవితంలో బ్రిటీష్‌ వారితో పోరాడిన అల్లూరిని.. వారితో కలిసి ...

Read More »

జగన్‌, కేంద్రమంత్రి షెకావత్‌ పోలవరం పర్యటన

పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శుక్రవారం పరిశీలించారు. పునరావాస కాలనీలను పరిశీలించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ముందుగా వ్యూ పాయింట్‌ వద్ద పరిశీలన చేసిన సీఎం, కేంద్రమంత్రి.. తర్వాత స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలించారు. అనంతరం పూర్తైన ఎగువ కాఫర్‌ డ్యాంను పరిశీలించారు.

Read More »

ఫుడ్‌ బిజినెస్‌లోకి నాగ చైతన్య

నాగ చైతన్య ప్రస్తుతం ఫుడ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. షోయూ పేరుతో హైదరాబాద్‌లో ఓ సరికొత్త రెస్టారెంట్‌ ఓపెన్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం చై తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీనికి వెంకటేశ్‌ కూతురు ఆశ్రిత.. ‘ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు’ అంటూ బెస్ట్‌ విషెస్‌ అందించింది.

Read More »

దిశ” బిల్లును ఆమోదించిందిన మహిళా పార్లమెంట్

పార్లమెంట్ స్పీకర్ స్థానంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు పలు బిల్లులకు ఆమోదం.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో శుక్రవారం జాతీయ మహిళా కమిషన్ సహకారంతో రాష్ర్ట మహిళా కమిషన్ నిర్వహించిన “మహిళా మాక్ పార్లమెంట్ “.దిశ బిల్లుతో పాటు 50 శాతం మహిళా రిజర్వేషన్, 21 ఏళ్ల వివాహ వయసుకు మాక్ పార్లమెంట్ ఆమోదం.

Read More »

ఏప్రిల్‌ 22 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. కొత్త పరీక్షల షెడ్యూల్‌ను సచివాలయంలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి శేషగిరి బాబుతో కలిసి గురువారం విడుదల చేశారు. ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జెఇఇ మొదటి విడత పరీక్షలు జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 8 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించాల్సిన పరీక్షలను ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ...

Read More »

నటి నళినికి ‘జీవిత సాఫల్య’

 ప్రముఖ నటి కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా శక్తికి సెల్యూట్‌ చేస్తూ పక్వాన్‌ చెన్నై ఆధ్వర్యంలో ఇటీవల 5వ వార్షిక రియలిస్టిక్‌ అవార్డ్స్‌-2022 ప్రదానోత్సవం నిర్వహించారు. పక్వాన్‌ చెన్నై నిర్వాహకులు సంజరు డాంగి, అనిల్‌ డాంగి, హితేష్‌ కొఠారి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన మహిళల విజయాలను కొనియాడుతూ అవార్డులను అందజేశారు. ముఖ్య అతిథిగా చెన్నై కస్టమ్స్‌ జోన్‌ చీఫ్‌ కమిషనర్‌ ఎంవిఎస్‌ చౌదరి అవార్డులను ప్రదానం చేశారు.

Read More »

గుంటూరులో ‘మహిళా పార్లమెంట్’ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వేలాదిమంది మహిళా ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ చైర్మన్ లతో జరగనున్న ‘గొప్ప స్ఫూర్తి సభ’ కు విజయవాడ వేదిక కానుంది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ సభ నిర్వహణ నిమిత్తం బుధవారం రాష్ట్ర మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారు, శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, మేయర్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, ...

Read More »

మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Read More »