Monthly Archives: May 2022

తాడేపల్లికి చేరుకున్న జగన్‌

వైఎస్‌ జగన్‌ దావోస్‌ పర్యటనను ముగించుకుని మంగళవారం తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రితోపాటు వెళ్లిన మంత్రుల బృందం నేడు స్వదేశానికి చేరుకుంది. విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సిఎం జగన్‌కు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

Read More »

‘రానా నాయుడు’ షూటింగ్‌ పూర్తి

అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ‘రే డోనోవన్‌’ ఆధారంగా ‘రానా నాయుడు’ అనే వెబ్‌ సిరీస్‌ రూపుదిద్దుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌ కోసం నిర్మితమౌతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో మొదటిసారి వెంకటేష్‌ నటిస్తున్నారు. ఇందులో ఆయన అన్న కొడుకు, హీరో దగ్గుబాటి రానా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇల్లీగల్‌ వ్యవహారాలు చేసే వ్యక్తిగా రానా, అతని తండ్రిగా, జైలునుండే అన్ని కార్యక్రమాలను సెట్‌చేసే గ్యాంగ్‌స్టర్‌గా వెంకటేశ్‌ నటిస్తున్నారు. అభిషేక్‌ బెనర్జీ, జాను టిబ్రేవాల్‌, సౌరవ్‌ ఖురానా, అభిషేక్‌ భలేరావ్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘రానా నాయుడు’ ...

Read More »

రాకేష్‌ తికాయత్‌ ముఖంపై సిరాతో దాడి

భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) నేత రాకేష్‌ తికాయత్‌పై నిరసనకారులు సిరాతో దాడి చేశారు. మీడియా సమావేశంలో తికాయత్‌ మాట్లాడుతుండగా ఈఘటన జరిగింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలో ఒక రైతు నేత డబ్బులు తీసుకుంటున్నట్లు ఇటీవల స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైంది. దీంతో తికాయత్‌కు, ఆయన అనుచరులకు వ్యతిరేకంగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి.  స్టింగ్‌ ఆపరేషన్‌ గురించి మాట్లాడేందుకు తికాయత్‌ సోమవారం బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

Read More »

అరుదైన ఘనత ఆమెదే.. హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ ఆమె ఖాతాలోనే..!

సాయిపల్లవి హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ను సాధించి అరుదైన రికార్డును సాధించారు. అశేష అభిమానుల్లో తమదైన ప్రత్యేక ముద్రను పొందడానికి కథానాయికలు పడే పాట్లు ఇన్నీఅన్నీ కావు. ఈ విషయంలో వాళ్లు ఏళ్లతరబడి నానాతంటాలు పడుతూనే ఉంటారు. కొన్ని సార్లు భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటించినప్పటికీ వారికంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడం కష్టం. కానీ … నేచురల్‌ నటి సాయిపల్లవి మాత్రం చాలా సులభంగా తనదైన శైలిలో ప్రత్యేకతను సంతరించుకున్నారు.

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసిపిదే విజయం : జోగి రమేష్‌

వచ్చే ఎన్నికల్లో వైసిపినే మళ్లీ విజయం సాధించబోతుందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌కు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర శనివారం చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రులకు వైసిపి నాయకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోగి రమేష్‌ మాట్లాడుతూ, సామాజిక న్యాయభేరి దెబ్బకి చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది సిఎం జగన్‌ మాత్రమేనన్నారు. సంక్షేమ పథకాల అమల తీరును చూసి చంద్రబాబుకు కడుపు మంట అని దుయ్యబట్టారు. ఎవరితో ...

Read More »

మాస్‌ లుక్‌లో బాలయ్య

నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర చేస్తున్నారు. నేడు దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు 100వ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ని మేకర్‌స విడుదల చేశారు. చేతిలో కత్తిని పట్టుకొని బాలయ్య మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ దునియా విజరు విలన్‌గా నటిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్‌లో 107వ చిత్రమిది. టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తాం’అని చిత్ర యూనిట్‌ ...

Read More »

సిబిఐ దాడులు చట్టవిరుద్ధమంటూ స్పీకర్‌కు కార్తి చిదంబరం లేఖ

వీసా కుంభకోణం కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ఎంపి కార్తి చిదంబరం శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ ప్రత్యేక హక్కుని సిబిఐ అధికారులు స్పష్టంగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఒకదాని తర్వాత మరొకటి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ సమస్య పార్లమెంట్‌ సభ్యునిగా తన హక్కులు, అధికారాలకు సంబంధించినదని, ఈ అత్యవసరమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి బాధపడుతున్నానని లేఖలో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ...

Read More »

డ్రగ్స్‌ కేసులో షారూఖ్‌ఖాన్‌ కుమారుడికి క్లీన్‌ చిట్‌

 డ్రగ్స్‌ కేసులో షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) శుక్రవారం క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.  ఆర్యన్‌ఖాన్‌, ఇతరుల వద్ద ఎలాంటి డ్రగ్స్‌ దొరకలేదని, అలాగే వారు డ్రగ్స్‌ తీసుకున్నట్లు సరైన ఆధారాలు లేవంటూ ఎన్‌సిబి చార్జిషీట్‌లో పేర్కొంది. మరో 14 మందిపై చార్జిషీట్‌ నమోదు చేసింది. షారూఖ్‌ ఖాన్‌, ఆర్యన్‌ ఖాన్‌ ఇద్దరికి ఉపశమనం లభించిందంటూ న్యాయవాది ముఖుల్‌ రోహత్గి పేర్కొన్నారు. ”ఆర్యన్‌, అతడి తండ్రి షారుక్‌కు గొప్ప ఉపశమనం లభించినట్లయింది. నిజం ఇప్పటికైనా బయటపడింది. ఆర్యన్‌ వద్ద ఎలాంటి ...

Read More »

జనసేన అధినేత పవన్‌పై కొడాలి నాని ఫైర్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుడివాడ మండలం లింగవరంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని విరుచుకుపడ్డారు. ఏ అవగాహనతో పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అని నిలదీశారు. అంబేద్కర్‌ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అనుసరించి ...

Read More »

ఎఫ్‌ – 3 కోసం రామ్‌చరణ్‌ పోస్ట్‌పోన్‌ !

 రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీతో సక్సెస్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత విడుదలైన ‘ఆచార్య’ మూవీ కూడా హిట్‌ కొడుతుందని ఆశిస్తే.. ఆ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టింది. దీంతో రామ్‌చరణ్‌ భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌ చాలా డిసప్పాయింట్‌ అయ్యారు. అందుకే మెగాఫ్యాన్స్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్ర అప్‌డేట్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి బయటకి వచ్చింది. ఇప్పటికే డైరెక్టర్‌ శంకర్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రెడీ చేశారని.. కొన్ని కారణాల ...

Read More »