Monthly Archives: June 2022

భారత్‌లో మత స్వేచ్ఛకు ముప్పు

భారత్‌లో మతస్వేచ్ఛకు తీవ్ర ముప్పు ఏర్పడిందని, దేశంలో మైనార్టీలపై గత ఏడాది పొడుగునా హత్యలు, దాడులు, బెదిరింపులు కొనసాగాయని అమెరికా ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2021 నివేదికను కాంగ్రెస్‌లో గురువారం అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ నివేదిక సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్‌ మాట్లాడుతూ ‘ప్రార్థనా స్థలాలపై పెరుగుతున్న దాడుల కారణంగా మైనార్టీలు ముప్పులో ఉన్నారు’ అని తెలిపారు. 2021లో భారత్‌లో ఏడాది పొడుగునా వివిధ ప్రదేశాల్లో మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ...

Read More »

23న ‘కొండా’ విడుదల

రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించిన కొండా మురళీ, సురేఖ జీవిత నేపథ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో అదిత్‌ అరుణ్‌, ఐరా మోర్‌, పథ్వీరాజ్‌ నటించారు. ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26నల విడుదల చేశారు. తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేస్తూ ‘కొండా’ విడుదల తేదీని ప్రకటించారు.

Read More »

అవమానాలు తట్టుకోలేకే టిడిపికి రాజీనామా: దివ్యవాణి

పార్టీలో అవమానాలు తట్టుకోలేకే టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి దివ్యవాణి ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో తనను అన్ని కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని చెప్పారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. కనీసం ప్రెస్‌మీట్లు పెట్టేందుకు కూడా ఎవరూ సహకరించడం లేదన్నారు. టిడిపి అధినేత చంద్రబాబును కలిసి వివరించే ప్రయత్నం చేసినా కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై వస్తున్న ఆరోపణలను దివ్యవాణి ఖండించారు. అవసరమైతే నేరుగా చంద్రబాబుకు రాజీనామా లేఖ అందిస్తానని తెలిపారు.

Read More »

బోయపాటి, రామ్‌ సినిమా ప్రారంభం

రామ్‌ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాను బుధవారం ప్రారంభించారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ‘బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్టాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు ...

Read More »