Monthly Archives: August 2022

వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి, బూచేపల్లి విగ్రహాలను ఆవిష్కరించిన జగన్‌

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి, బూచేపల్లి విగ్రహాలను సిఎం జగన్‌ ఆవిష్కరించారు. బుధవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రకాశం జిల్లా చీమకుర్తికి సిఎం జగన్‌ హెలికాప్టర్‌లో బయలుదేరారు. చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు.

Read More »

హిందీ ‘విక్రమ్‌ వేద’ టీజర్‌

తమిళ్‌ లో విజరు సేతుపతి, మాధవన్‌ నటించిన ‘విక్రమ్‌ వేద’ చిత్రం అదే పేరుతో హిందీలో రాబోతోంది. హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన తారాగణంతో దర్శకులు పుష్కర్‌, గాయత్రిలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ని విడుదలచేశారు. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రం విడుదలవుతోంది.

Read More »

టీమిండియాకు ఎదురుదెబ్బ… ద్రవిడ్‌కు కోవిడ్‌ పాజిటివ్‌

మరో 4 రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభం కానుండగా … టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా కప్‌ కోసం యూఏఈ బయలుదేరే ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా రాహుల్‌ ద్రవిడ్‌కు పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. దీంతో భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ లేకుండా జట్టు యూఏఈకి వెళ్లాల్సి వుంటుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, పంత్‌ వంటి ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. ఈ టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆ ...

Read More »

ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష

ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి చెక్‌బౌన్స్‌ కేసులో చెన్నైలోని సైదాపేట్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కొన్ని సంవత్సరాల క్రితం.. కార్తి, సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్‌ కుల్ల’ పేరుతో ఓ సినిమా తీయాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్‌ చంద్రబోస్‌ పీవీపీ సినిమాస్‌ నుంచి అప్పు తీసుకున్నారు. అయితే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో లింగుస్వామి, ఆయన సోదరుడు కలిసి పీవీపీ సినిమాస్‌ నుంచి తీసుకున్న సొమ్మును చెక్కు రూపంలో తిరిగి చెల్లించారు. అయితే, ఆ చెక్కు ...

Read More »

చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌ విడుదల

‘ 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సడెన్‌గా తిరిగొచ్చిన 6 ఏళ్లల్లో జనంలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక్కడికి ఎవ్వరొచ్చిన రాకపోయినా నేను పట్టించుకోనూ.. కానీ అతను రాకూడదు. హి ఈజ్‌ రీజన్‌ ఫర్‌ ఎవ్రీగాన్‌ థింగ్‌, కిల్‌ హిమ్‌’ అంటూ అతడి గురించే మాట్లాడుకుంటారు. ఆయనే గాడ్‌ ఫాదర్‌. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ ఈ టీజర్‌ను విడుదల చేసింది. గాడ్‌ ఫాదర్‌ అని ఎందుకంటున్నారో తెలియాలంటే.. దసరా ...

Read More »

అమిత్‌ షాతో జూనియర్‌ ఎన్‌టిఆర్‌ భేటీ

తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణలేని బిజెపి అక్కడ పాగా వేసేందుకు సినీ ప్రముఖులకు గాలం వేస్తోంది. అందులో భాగంగా తెలుగు సినీ దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ అవకాశమిచ్చింది. తాజాగా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న జూనియర్‌ ఎన్‌టిఆర్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని అమిత్‌ షా సమావేశం కావడం తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ రాజకీయాల్లో కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి 10.20 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కి వచ్చిన అమిత్‌ షా… జూ.ఎన్‌టిఆర్‌ కోసం అరగంట సేపు వేచి చూశారు. జూ.ఎన్‌టిఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ...

Read More »

బీజేపీని ఓడించే సత్తా టిఆర్‌ఎస్‌కే ఉంది: సీపీఐ చాడ

బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియా ఎదుట ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. ”బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే మా మద్దతు. ఉపఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదు. బీజేపీని ఓడించే సత్తా ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉంది. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. ఇది మునుగోడుకే పరిమితం కాదు. భవిష్యత్‌లో కూడా టీఆర్‌ఎస్‌తో పని చేస్తాం. 2018 ...

Read More »

లైగర్‌ మూవీకి బాయ్ కాట్‌ సెగ

సోషల్‌ మీడియాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు ‘బాయ్ కాట్‌ లాల్‌సింగ్‌ చడ్డా’ ట్యాగ్‌లైన్‌ ట్రెండ్‌ చేయడంతో… ఆ మూవీ విజయం సాధించలేకపోయింది. అయితే సోషల్‌మీడియాలో అమీర్‌కి కొంతమంది నెటిజన్లు మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే బాయ్ కాట్‌ ప్రచారం కావడంతో.. అమీర్‌ ఆర్థికంగా నష్టపోయాడు. లాల్‌సింగ్‌ చడ్డా మూవీతో మొదలైన  బాయ్ కాట్‌ సెగ.. ఆ తర్వాత రిలీజ్‌ అయ్యే సినిమాలకూ తగులుతుంది. తాజాగా సోషల్‌ మీడియాలో ‘లైగర్‌’ మూవీకి  బాయ్ కాట్‌  ట్యాగ్‌లైన్‌ ట్రెండ్‌ అవుతుంది. అయితే కొంతమంది నెటిజన్లు ...

Read More »

మునుగోడులో రేవంత్‌ రెడ్డి కొత్త వ్యూహం

 మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వివిధ రాజకీయ పార్టీలనేతలు పావులు కదుపుతున్నారు. సీఎం కేసీఆర్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బహిరంగ సభలు ఉండటంతో అధికార తెరాస, బిజెపి ముఖ్య నేతలంతా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మకాం వేశారు. మండలాల వారీగా జనసమీకరణపై స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.పిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి సైతం కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపధ్యంలో మునుగోడులో శనివారం పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఒకే రోజు ఐదు మండలాల్లో పాదయాత్రకు ...

Read More »

‘ధమాకా’ పాట విడుదల

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ధమాకా’ ఒకటి. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాట లిరికల్‌ వీడియోను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ అందించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Read More »