Monthly Archives: January 2024

వేములవాడ దేవాలయానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని…హెచ్ఎండీఏకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హెచ్ఎండీఏ నుంచి వేములవాడ రాజన్న దేవాలయానికి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. వేములవాడ ఆలయ అభివృద్ధిపై ఆయన టెంపుల్ డెవలప్‌మెంట్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…. వేములవాడలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

Read More »

బాబుకు ప్రతిపక్ష హోదా కూడా రాదు- కొడాలి నాని

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మతి భ్రమించింది. ప్రజలకు ఏం చేస్తారో కూడా చెప్పలేక జగన్ ను తిడుతున్నారు. 2019లోనే చంద్రబాబును ప్రజలు హైదరాబాద్ కి పంపించేశారు. సీట్లు రాని, మేము తీసేసిన వాళ్లు టీడీపీలో చేరుతున్నారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నారు.వైసీపీ కొత్త మేనిఫెస్టోతో చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేస్తామని తెలిపారు. పదవీ ...

Read More »

6 వేల పోస్టుల మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ లో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదముద్ర వేసింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ ప్రాసెస్ లో భాగంగా తొలుత టెట్ నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. డీఎస్సీలో టెట్ మార్కుల వెయిటేజీ ఉండడంతో తొలుత టెట్ నిర్వహించి, ఫలితాలు వెల్లడించాక డీఎస్సీ నోటిఫికేషన్ జారీ ...

Read More »

పంజాగుట్ట పీఎస్ సిబ్బందిని బదిలీ చేసిన సీపీ

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది మొత్తాన్నీ బదిలీ చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఐల నుంచి హోంగార్డుల దాకా మొత్తం 85 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ సిటీ ఆర్మ్ డ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. వారి స్థానంలో ప్రస్తుతం 82 మందిని నియమించారు. పంజాగుట్ట పీఎస్ లో సిబ్బంది మొత్తాన్ని ఒకేరోజు బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వంలోని పెద్దలకు ఈ ...

Read More »

NBK109లో బాలయ్యకు జోడీగా సైంధవ్ హీరోయిన్

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ చిత్రం NBK109 వర్కింగ్ టైటిల్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సైంధవ్ మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ నటించనున్నట్లు సమాచారం. ఆమె ఇటీవలే ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ నైట్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా బాలకృష్ణపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారట. 1980ల బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ...

Read More »

నెయ్యి దీపం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?

సనాతన్ వైదిక హిందూమతంలో దీపం, నెయ్యి రెండూ పవిత్రమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. నెయ్యి స్వచ్ఛతకు చిహ్నం అయితే, దీపం స్వచ్ఛమైన అగ్ని సూత్రాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఈ రెండు కలిస్తే అక్కడ మరో అద్భుతం జరగనుంది. అవును. ఈ రెండింటి కలయిక అంటే నెయ్యి దీపం. హిందూ ధర్మంలో నెయ్యి దీపం ఆధ్యాత్మికం, ఆచరణాత్మకమైనది. దీపం మనల్ని చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తుంది. ఈ దీపం మానవాళికి శాంతి, వెలుగు, మంచి సంతానం అనే సందేశాన్ని పంచుతుంది. శ్రావ్యమైన వాతావరణాన్ని సృష్టించడానికి, గాలిని ...

Read More »

రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు..!

చిరుధాన్యాలను వాడే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. తెల్లరవ్వతో చేసిన టిఫెన్స్‌ కాకుండా.. రాగులు, సజ్జలు, జొన్నలుతో చేసిన పిండితో టిఫెన్స్‌ వేసుకుంటున్నారు. రాగులను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ రాగులను ఎలా తినాలి..? జావ చేసుకోవడం మీకు ఎలాగూ తెలుసు..? రాగి సంగటి..ఇది చికెన్‌, మటన్‌లోకే మస్త్ ఉంటుంది. రాగి ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన మ‌రియు ఆరోగ్యక‌ర‌మైన వంట‌కాల్లో రాగి దిబ్బ‌రొట్టె కూడా ఒక‌టి. రాగి దిబ్బ‌రొట్టె చాలా రుచిగా ఉంటుంది. ...

Read More »

శరీరంలో ఎక్కువ సోడియం, తక్కువ పొటాషియం ఉంటే…?

సోడియం, పొటాషియం శరీర ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఖనిజాలు. శరీరంలో చాలా సోడియం, చాలా తక్కువ పొటాషియం ఉంటే.. అది అధిక రక్తపోటుకు కారణమవుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం.. సోడియం ఎక్కువగా, పొటాషియం తక్కువగా ఉన్న ఆహారాన్ని అనుసరించే వారికి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో పొటాషియం ముఖ్యమైన పోషకం. అందువల్ల, అధిక రక్తపోటును నియంత్రించడానికి, మీ ఆహారంలో పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని వీలైనంత వరకు చేర్చండి. ...

Read More »

తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి..
శంకుస్థాపన చేశామన్న రాష్ట్రపతి

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. నారీశక్తి వందన్‌ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించామని తెలిపారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోందని చెప్పారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశామని వెల్లడించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించి.. అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించుకున్నామని వివరించారు. ఎన్నో ఏళ్ల భారతీయుల కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైందని హర్షం వ్యక్తం ...

Read More »

సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని.. ఏకగ్రీవ తీర్మానం చేశామన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తాము ఏకగ్రీవ తీర్మానం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దానికి ముఖ్యమంత్రి పైవిధంగా స్పందించారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మాత్రమే తాము తీర్మానం చేశామని… దానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి నామినేషన్ వేస్తే ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలకు ...

Read More »