23న ‘కొండా’ విడుదల

రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతను సాధించిన కొండా మురళీ, సురేఖ జీవిత నేపథ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో అదిత్‌ అరుణ్‌, ఐరా మోర్‌, పథ్వీరాజ్‌ నటించారు. ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26నల విడుదల చేశారు. తాజాగా రెండో ట్రైలర్‌ను విడుదల చేస్తూ ‘కొండా’ విడుదల తేదీని ప్రకటించారు.