24 గంటల్లో 9887 కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నా దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌లు నమోదవుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9887 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 294 మంది మృత్యువాత పడ్డారు. కొత్త కేసులతో కలుపుకొని దేశంలో ఇప్పటివరకు 2,36,657 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,14,073 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,642 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 1,15,942 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.