25 మంది ఎంపిల‌కు కరోనా..

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల మొదటిరోజున నిర్వహించిన కరోనా పరీక్షల్లో 25 మంది స‌భ్యు‌ల‌కు పాజిటివ్‌గా నిర్థారణైంది. మీనాక్షిలేఖి, అనంత్‌కుమార్‌ హెగ్డే, పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, పార్లమెంటు సమావేశం మొదటిరోజున సుమారు 200 మంది సభ్యులు సభకు హాజరయ్యారు. సందర్శకుల గ్యాలరీలో మరో 30 మంది ఉన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు.