26న ధియేటర్లలో సందడి చేయనున్న అల్లుఅర్జున్‌ ‘ ఆ’ సినిమా

ఐకాన్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-1… ధియేటర్ల వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఇప్పుడు ఆయన మరో చిత్రం ధియేటర్లలో సందడి చేయనుంది. పుష్ప పార్ట్‌ 1 ఓటీటీల్లోకి వచ్చేసింది కదా… మాకు తెలియకుండా ఇంకో సినిమా ఏంటనుకుంటున్నారా.. అదేనండి అలా వైకుంఠపురం. అదేంటీ అల్రెడీ రిలీజ్‌ అయ్యింది అనుకుంటున్నారా.. తెలుగులో కాదండి.. హిందీలో ఈ సినిమా సందడి చేయనుంది. మూవీ మేకర్స్‌ ఈ సినిమాను హిందీలోకి డబ్‌ చేసి.. ఈ నెల 26న ధియేటర్లలో విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించిన 2020లో తెలుగులో విడుదలై.. ఆ ఏడాది భారీ వసూళ్లను రాబట్టుకున్న ఈ చిత్రంగా నిలిచింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కూడా అవుతుంది. హిందీలో విడుదల చేస్తున్నట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. ఇక మన తెలుగు మేకర్స్‌ ప్రకటించాల్సి ఉంది.