26 నుంచి బిగ్‌బాస్‌

బుల్లితెర ప్రేక్షకులు కోసం బిగ్‌ బాస్‌ ఓటిటికి సమయం ఆసన్నమైంది. ‘బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌’ పేరుతో ప్రీమియర్‌ కానున్న ఈ షో తేదీని ప్రకటించేందుకు మేకర్స్‌ తాజాగా ప్రోమోను విడుదల చేశారు. బిగ్‌ బాస్‌ తెలుగు వెర్షన్‌ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. ఈ సరికొత్త డిజిటల్‌ సీజన్‌ గ్రాండ్‌ గా ప్రారంభమవుతుంది. ఇక ఇందులో దాదాపు 15 మంది పోటీదారులు పాల్గొననున్నారు. హోస్ట్‌ నాగార్జున అక్కినేని షోని శనివారం ప్రారంభిస్తున్నారు. షో హౌజ్‌ లోపల ఎలా ఉందన్న విషయాన్ని ఈ చిన్న వీడియో ద్వారా తెలిపారు. ఇక షోలో కంటెస్టెంట్లు ఎవరు ? వంటి తదితర వివరాలను షో లాంచ్‌ సమయంలో వెల్లడించనున్నారు.