’30 వెడ్స్‌ 21′ రెండో సీజన్‌ టీజర్‌

గత సంవత్సరం యూట్యూబ్​లో విడుదలై బాగా పేరు తెచ్చుకొని, ప్రేక్షకులకి బాగా నచ్చిన వెబ్ సిరీస్ లలో ’30 వెడ్స్​ 21′ ఒకటి. 30 ఏళ్ల బ్యాచిలర్​కు 21 ఏళ్ల అమ్మాయితో వివాహం అయితే వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో కామెడీ, ఎమోషనల్ గా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఇందులో మెయిన్ లీడ్స్ లో నటించిన చైతన్య, అనన్య అందర్నీ మెప్పించారు. ఈ సిరీస్ బాగా హిట్ అవ్వడంతో, యూట్యూబ్ లో కూడా ఎక్కువ వ్యూస్ సంపాదించడంతో రెండో సీజన్ ని కూడా ప్లాన్ చేశారు.