కర్నూలులో 466కు చేరిన కరోనా కేసులు
కర్నూలులో 466కు చేరిన కరోనా కేసులు

కర్నూలులో 466కు చేరిన కరోనా కేసులు

కరోనా కేసుల సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో మరో 30 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 466కు చేరాయి. 30 కేసుల్లో కర్నూలు నగరంలోనే 28 ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా కర్నూలు నగరంలో 293, నంద్యాల మున్సిపాలిటీలో 90, నందికొట్కూరు మున్సిపాలిటీలో 10, ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏడు, బేతంచెర్ల, డోన్, ఆదోని మున్సిపాలిటిల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.గ్రామీణ ప్రాంతాల్లో నంద్యాల రూరల్‌లో 9, కోడుమూరులో 10, పాణ్యంలో 8, బనగానపల్లెలో 7, చాగలమర్రిలో 5, పాములపాడులో 4, శిరువెళ్లలో 3, గడివేములలో 2, ఆస్పరి, బండిఆత్మకూరు, గోనెగండ్ల, కల్లూరు, కృష్ణగిరి, కర్నూలు, నందికొట్కూరు, ఓర్వకల్లు, అవుకు, రుద్రవరం, సంజామల, తుగ్గలి, వెల్దుర్తిలలో ఒక్కో కేసు నమోదయ్యాయి.