53 వేల కోట్లు నష్టపోయిన జుకర్​బర్గ్
53 వేల కోట్లు నష్టపోయిన జుకర్​బర్గ్

53 వేల కోట్లు నష్టపోయిన జుకర్​బర్గ్

నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల ఫేస్​బుక్​ సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది.ఆ సంస్థ షేర్ విలువ శుక్రవారం దాదాపు 8.3 శాతం పతనమైంది. యూనిలీవర్ తో పాటు వెరిజోన్ కమ్యూనికేషన్స్, హెర్షీస్ తదితర సంస్థలు ఫేస్​బుక్ ను బాయ్​కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇకపై ఆ సంస్థకు యాడ్స్ ఇవ్వబోమని ప్రకటించాయి. మరో అంతర్జాతీయ సంస్థ కొకాకోలా నెల రోజుల పాటు సోషల్ మీడియా సంస్థలకు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది.