భారత్లో కరోనావైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,320 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో శనివారం ఉదయం నాటికి భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,662కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 95 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 1981కి చేరింది. ఈ మహమ్మారి నుంచి కోలుకొని 17,847 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో ప్రస్తుతం 39,834మంది చికిత్స పొందుతున్నారు.
