దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. మంగళవారం ఉదయం నాటికి దేశంలో 70,756 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3604 పాజిటివ్ కేసులతో పాటు 87 మంది బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2293కి చేరింది. దేశంలో ప్రస్తుతం 46,006 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 22454 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చారి అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

70 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు