ఏపీలో ఘనంగా 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 73 వ గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో విజిటర్స్‌కు అనుమతి నిరాకరించారు.