ఆంధ్రపదేశ్‌లో కొత్తగా 76 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3118కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,567 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 76 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,169 మంది కరోనా నుంచి కోలుకోగా, 64 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా వైరస్ యాక్టివ్ కేసులు సంఖ్య 885గా ఉంది.
