8,314 హెక్టార్లలో పంట నష్టం
8,314 హెక్టార్లలో పంట నష్టం

8,314 హెక్టార్లలో పంట నష్టం-మంత్రి కురసాల కన్నబాబు

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పాడైన రబీ పంటలను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నాబాబు పరిశీలించారు. కాకినాడ రూరల్‌లో సోమవారం పర్యటించిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 7,455 వరి దెబ్బతిన్నట్లు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. మొక్కజొన్న 539 హెక్టార్లలో, నువ్వులు 275, వేరు శెనగ 23, సన్‌ఫ్లవర్‌ 5 హెక్టార్లలో.. మొత్తం 8,314 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2266 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయన్నారు.