నాయుడుపేటలో నేడు జగన్ బహిరంగ సభ

CM జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగనుంది. గురవరాజుపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. చిన్నసింగమలలో ఉ.11గంటలకు లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ సమావేశమవుతారు. మధ్యాహ్నానికి యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నాయుడుపేటలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గూడూరు బైపాస్, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.