హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి మరో పాట విడుదలైంది. ఇందులో అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ క్రమంలో నిర్వహిస్తున్న ప్రమోషన్ల లో భాగంగా ‘లైగర్’ నుంచి ‘ఆఫట్’ అనే పల్లవితో సాగే పాట ప్రోమోను గురువారం విడుదల చేశారు. పూర్తి పాటను 5న విడుల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జొహార్, పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషించారు.
