కల్కి 9 భాగాలుగా రాబోతుందా…

ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ఈ చిత్రం రూపొందుతుండడంతో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ మూవీ మంచి క్యూరియాసిటీ నెలకుంది. కాగా ఈ మూవీ ఒకటికంటే ఎక్కువ భాగాలుగా రాబోతుందంటూ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఈమధ్య కాలంలో ఈ సినిమా మొత్తం 9 భాగాలుగా రాబోతుందంటూ ఓ వార్త ఫిలిం వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది.


ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆడియన్స్ లో మూవీ పై మరింత ఆసక్తి మొదలయింది. తాజాగా టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం.. తన రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు. అభినవ్ గోమఠం ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను కల్కి మూవీ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాను. ఇక ఇటీవల ఈ మూవీ 9 పార్టులుగా రాబోతుందిని నేను విన్నాను. అది విన్న దగ్గర నుంచి సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన ఓ ప్రముఖ నటుడు ఇలా కామెంట్ చేయడంతో ఈ 9 భాగాలు వార్త సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంది.