ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దు..చిరంజీవి

కొరటాల శివ, మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్‌ ప్రభావంతో ఆలస్యమవుతూ వస్తోంది. చిన్నపాటి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవ్వాల్సి ఉండగా..కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో దర్శకుడు చిత్రీకరణను నిలిపివేశాడు. ఇప్పుడు ప్రస్తుతం లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు రావడంతో చిత్రీకరణను మొదలుపెట్టాలన్న ఆలోచనలో చిత్రబృందం ఉంది. ఇంకా 15 రోజులు షూట్‌ మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేయాలని కొరటాలకు చిరు సూచించారు. హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌, పూజాహెగ్డే ఫీమేల్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు.