హనుమాన్ గుడిని నిర్మించిన స్టార్ హీరో అర్జున్

‘యాక్షన్ కింగ్’ అర్జున్ తన ఇష్టదైవమైన హనుమాన్ టెంపుల్ ను నిర్మించారు. తాజాగా ఈ గుడి ఓపెనింగ్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎంతో వైభవంగా ఈ గుడి ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా అర్జున్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గుడిని ప్రారంభించారు. భారీ రేంజ్ లో ఈ గుడిని నిర్మించి హనుమంతుని భక్తులను మంత్రముగ్ధులను చేశాడు అర్జున్.

తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఆయా ఆలయాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవం అనంతరం పూజా, అభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక్కడ ప్రతిష్టించిన భారీ హనుమాన్ విగ్రహం బరువు 140 టన్నులు. ఆ విగ్రహం ఇప్పుడు అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయ నిర్మాణం కోసం భారీగానే ఖర్చయ్యిందట. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కృష్ణ వంశీ దర్శకత్వం నితిన్ హీరోగా నటించిన “శ్రీ ఆంజనేయం” చిత్రంలో అర్జున్ హనుమంతుడిగా కన్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో “ఫ్రెండ్ షిప్” అనే చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్, లోస్లియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.