భూవివాదంలో కోర్టుకు హాజరైన హీరో దగ్గుబాటి రానా

ఫిలింనగర్‌లోని భూ వివాదం కేసులో సినీ హీరో దగ్గుబాటి రానా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. ఫిలింనగర్‌కు నటి మాధవిలతకు చెందిన రెండు వేల రెండు వందల చదరపు గజాల స్థలాన్ని సినీనిర్మాత దగ్గుబాటి సురేష్ కొనుగోలు చేశారు. లీజ్ అగ్రిమెంట్ కొనసాగుతుండగానే వెయ్యి గజలా స్థలాన్ని దగ్గుబాటి రానాకు రిజిస్ట్రేషన్ చేశారు. లీజు గడువు ఉండగానే వ్యాపారిని స్థలం నుంచి ఖాళీ చేయాలని రానా వత్తిడి చేశారు. దీంతో బాధితుడు సిటీసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నుండి నోటీసులు రావడంతో కోర్టుకు హాజరయ్యారు.