కుమారుడి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌

విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటీ మళ్లీ పెళ్లా..? పెళ్లికూతురెవరు..? ఎప్పుడు.. ఎక్కడ అని సందేహిస్తున్నారా..! మంగళవారం ఆగస్టు 24న తన వివాహమహోత్సవం రోజున కుమారుడు వేదాంత్‌ కోరిక మేరకు.. అతని ఎదుటే భార్య పోనీవర్మకి ప్రకాశ్‌రాజ్‌ ఉంగరం తొడిగాడు. ఇలా తన భార్యనే… తాను మరోసారి వివాహం చేసుకున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. మా వివాహానికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం అని ప్రకాశ్‌ రాజ్‌ తన ట్విట్‌లో తెలియజేశారు. ఈ సందర్భంగా భార్య పోనీ వర్మ, తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోల్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు.