నటుడు ఉత్తేజ్ ఇంట తీవ్ర విషాదం

 నటుడు ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఉత్తేజ్‌ను పరామర్శిస్తున్నారు. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌ కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.