నటి కవిత భర్త కన్నుమూత

సీనియర్‌ నటి కవిత భర్త దశరథ రాజు బుధవారం ఉదయం కన్నుమూశారు. మూడు వారాల క్రితం ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే! ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. రెండు వారాల క్రితం కవిత కుమారుడు సాయి స్వరూప్‌ కరోనాతో మరణించారు. దశరథ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు కవితను పరామర్శించారు. దక్షిణాది భాషల్లో 350కు పైగా చిత్రాల్లో నటించారు కవిత.