నటి శోభనకు ఒమిక్రాన్‌

దేశంలో కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోనూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. లేటెస్టుగా సీనియర్‌ సినీ నటి, హీరోయిన్‌ శోభన కోవిడ్‌ బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. వైరస్ భారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు తెలిపింది. కీళ్లనొప్పులు, చలి, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డాను. ఇప్పటికే రెండు టీకాలు తీసుకున్నాను. దీంతో ఒమిక్రాన్‌ ముప్పు నుంచి 85శాతం కోలుకుంటామని నమ్ముతున్నాను అని సోషల్ మీడియా ద్వారా చెప్పింది. ఇప్పటికీ వాక్సిన్ తీసుకోని వారు వెంటనే వాక్సిన్ తీసుకోమని కోరుతున్నా అని తెలిపింది శోభన.