డైరెక్టర్‌గా మారిన లేడీ విలన్.. ఫస్ట్‌లుక్ అదుర్స్

సీనియర్ హీరో శరత్‌కుమార్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తొలినాళ్లలో హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించినా బరువు పెరగడంతో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో రూటు మార్చి విలనిజం చూపించడం మొదలుపెట్టింది. దీంతో లేడీ విలన్‌గా ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నటనపై బోరు కొట్టిందో ఏమో వరలక్ష్మి ఇప్పుడు డైరెక్టర్ అవతారమెత్తింది.