కబడ్డీ ఆడిన మంత్రి రోజా

ఆడుదాం ఆంధ్రా’ ఫైనల్స్లో మంత్రి రోజా సందడి చేశారు. విశాఖలోని ఏయూలో జరుగుతున్న కబడ్డీ ఫైనల్స్ను ప్రారంభించిన ఆమె.. కాసేపు కబడ్డీ ఆడి అలరించారు. ‘ట్వంటీ ట్వంటీ ఫోర్.. జగనన్న వన్స్ మోర్’ అంటూ రైడ్ కు వెళ్లారు. అనంతరం మాట్లాడిన రోజా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సీఎం జగన్ క్రీడల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని అన్నారు.