స్టార్ ప్రొడ్యూసర్‌కు కరోనా పాజిటివ్

స్టార్ ప్రొడ్యూసర్‌కు కరోనా పాజిటివ్

బాలీవుడ్‌ని కరోనా కుదిపేస్తోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరిమ్ మోరానికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే ఆయన ఇద్దరు కూతుళ్లకు కరోనా సోకింది. దీంతో వారిద్దరు ముంబైలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముందుగగా పెద్ద కూతురు షాజా మోరానికి కరోనా పాజిటవ్ అని తేలింది. ఆమె గత నెల మొదటివారంలో దుబాయ్ నుంచి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. ఆ సమయంలోనే చిన్న కూతురు జోయా మోరానికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. ఆమెకు కరోనా వచ్చినట్లు మంగళవారం అధికారులు నిర్ధారించారు. దీంతో జోయా మోరానీ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆమె అక్క షాజా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది.

ఇదే సమయంలో మరోవైపు కరీమ్ మోరానీ దంపతులు కూడా టెస్టులు చేయించుకున్నారు. అయితే, వీరి రిపోర్టులు కూడా అందాయి. అందులో కరీమ్ మోరానికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని కరిం స్వయంగా ప్రకటించారు. అయితే ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు కూడా టెస్ట్ చేయించుకోవటంతో ఆయన రెండో కూతురు జోయాతో పాటు తాను కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కలవరం మొదలైంది.

కరింకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా ఆయన సోదరుడు మొహమ్మద్‌ మోరానీ అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన నానావతి ఆస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, ఇంట్లో ఆయన భార్య, పనివారికి కూడా టెస్ట్ లు నిర్వహించారని వారందరికీ నెగెటివ్‌ వచ్చినట్టుగా ఆయన వెల్లడించారు. కరిం షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన రావన్‌, చెన్నై ఎక్స్‌ ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయిర్‌, దిల్ వాలే లాంటి సినిమాలకు కరీమ్ మోరాని నిర్మాతగా వ్యవహరించారు. బాలీవుడ్‌లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరడగంతో ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.