అఖిల్‌ ‘ఏజెంట్‌’ షూటింగ్‌ ప్రారంభం

అఖిల్‌ అక్కినేని, స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డిల ఫస్ట్‌ క్రేజీ కాంబినేషన్‌లో హై బడ్జెట్‌, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. ఈ సినిమాలో అఖిల్‌ ఇంతవరకూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్‌ సోమవారం ప్రారంభమైందని దర్శకుడు సురేందర్‌ రెడ్డి ప్రకటించారు. అఖిల్‌ ఈ చిత్రంలో ఏజెంట్‌గా సరికొత్త రూపంలో కనిపించనున్నాడు. సురేందర్‌ రెడ్డి ఆదివారం జిమ్‌లో అఖిల్‌ బ్యాక్‌ పోజ్‌ విడుదల చేయగా, ఈ రోజు ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. కండలు తిరిగిన దేహంతో స్లీవ్‌లెస్‌ టీషెర్ట్‌ని పైకి ఎత్తి ఉన్న ఈ పోస్టర్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అఖిల్‌ తన గన్‌ని ప్యాంట్‌లో పెట్టుకోవడం చూడొచ్చు. సురేందర్‌ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో గతంలో కిక్‌, రేసుగుర్రం వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. కాగా వారిద్దరి కలయికలో మరో బ్లాక్‌ బస్టర్‌గా ఏజెంట్‌ రూపొందబోతుంది.