రెడ్డి ని పెళ్లాడిన బన్నీ హీరోయిన్

రెడ్డి ని పెళ్లాడిన బన్నీ హీరోయిన్

‘నమ్మవేమో కాని.. అందాల యువరాణి.. నేలపై వాలిందీ.. నా ముందే నిలిచింది’ అంటూ అల్లు అర్జున్‌తో విరహగీతాలు పాడించి ‘పరుగు’ పెట్టించిన ‘పరుగు’ హీరోయిన్ షీలా కౌర్ పెళ్లి పీటలు ఎక్కింది. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని పెళ్లాడింది షీలా. బుధవారం నాడు చెన్నైలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం సింపుల్‌గా జరిగినట్టు తెలుస్తోంది.

అల్లు అర్జున్‌తో ‘పరుగు’, ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’ రామ్‌తో ‘మస్కా’ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు మెల్లగా ఆఫర్స్ తగ్గిపోవడంతో చివరిగా బాలయ్య ‘పరమవీర చక్ర’ సినిమాలో నటించింది. వీటితో పాటు హలో ప్రేమిస్తారా, రాజు భాయ్, సీతాకోక చిలుక తదితర చిత్రాలతో పాటు కన్నడ, మళయాలంలో పాతికకిపైగా చిత్రాల్లో నటించింది షీలా.

అయితే ఆమెకు అన్ని భాషల్లోనూ ఆఫర్స్ బాగానే వచ్చినప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో షీలా మెల్ల మెల్లగా సినిమాలకు దూరమైంది. ఈ మధ్య కాలంలో ఆమె బాగా బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన తరువాత సంతోష్ రెడ్డితో రియల్ లైఫ్ వైఫ్‌గా మారి సర్ ప్రైజ్ చేసింది షీలా.