అసిడిటీగా ఉన్నప్పుడు లవంగాలతో ఇలా చేయండి

అసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు ఇలా అనేక సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య వచ్చిదంటే చాలు.. దీనికి తోడు అనేక సమస్యలన్ని మనల్ని చుట్టుముడతాయి. అందుకే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యని త్వరగా తగ్గించుకోవచ్చు. వీటిని వాడడం వల్ల ఇతర సమస్యలు ఏవి కూడా రావు. పైగా ఇవి అందరికీ అందుబాటులో ఇంట్లోనే ఉంటాయి. వీటిని వాడితే త్వరగా సమస్య తగ్గిపోతుంది. అవేంటో తెలుసుకోండి..

అసిడిటీగా అనిపించినప్పుడు నీటిని తీసుకోవాలి. ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా పుదీనా కూడా ఈ సమస్యలని దరి చేరనివ్వకుండా ఉంచుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే నీటిలో కొద్దిగా పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. ఇది బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకూ ఉంచాలి. ఆ తర్వాత అందులో తేనె కలపాలి. ఇలా రెగ్యులర్‌గా తాగుతుంటే త్వరగానే సమస్య తగ్గిపోతుంది. అవసరం అనుకుంటే ఇందులో కొద్దిగా అల్లం రసం కూడా కలపొచ్చు. లేదా.. పుదీనా వేసినప్పుడే అల్లం ముక్కని వేసి మరిగించాలి. ఇలా చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది.