రేగిపండ్లు తింటే ఈ భయంకరమైన జబ్బు రాదట..

రేగిపండ్లు తింటే ఈ భయంకరమైన జబ్బు రాదట..

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. వీటిని తినడం వల్ల ఆయా సమయాల్లో వచ్చే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చని చెబుతుంటారు. ఇందులో భాగంగానే మనం ఇప్పుడు రేగి పండ్ల గురించి తెలుసుకుందాం. వీటిని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

రేగి పండ్లలో ఎన్నో అద్భుత పోషకాలు ఉన్నాయి.. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం ఇందులో అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల చాలా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. రేగి పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్తాయి. కాలేయం పని తీరు కూడా మెరుగుపడుతుంది.

ఈ పండులో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. దీని వల్ల కండరాలు, దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. కాబట్టి, చిన్నపిల్లలు, పెద్దవారు వీటిని తినడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. దీంతో.. వారికి ఎముకలు, దంతాలు బలహీనమయ్యేటువంటి సమస్యలు దూరం అవుతాయి.