ఓటీటీలో అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌…. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. డైరెక్టర్ దుశ్యంత్‌ దర్శకత్వములో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా వసూళ్లు సాధిస్తోంది.ఈ సినిమా లో శివాని నగరం కథానాయికగా గా నటించింది. అలాగే శరణ్యా ప్రదీప్‌ మరో కీలక పాత్ర పోషించింది. జీఏ2 పిక్చర్స్, మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

థియేటర్లలో అభిమానులను మెప్పించిన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం ఆహా సుహాస్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల పై కీలక అప్ డేట్ ఇచ్చింది ఆహా…. మూవీ ఎప్పుడూ స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని తన అధికార సోషల్ మీడియాలో పేర్కొంది.అయితే ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం మార్చి 1 న ఓటీటీ లో రిలీజ్ కానుంది.