పింఛన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్ధురాలు మృతి

అసెంబ్లీ ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ వివాదం ఏపీ పాలిటిక్స్ ‌ను కుదిపేస్తుంది. ఏపీ సర్కారు నేటి నుంచి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పడంతో లబ్దిదారులు ఉదయం నుంచి సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లను పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ విధుల నుంచి ఈసీ తొలగించింది. సచివాలయాల వద్ద లబ్దిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ క్రమంలో కృష్ణ జిల్లా గంగూలురులో పింఛన్ కోసం వెళ్లిన 80 ఏళ్ల వజ్రమ్మ వడదెబ్బకు మృతి చెందింది. ఉదయం నుంచి ఎండ తట్టుకోలేక వజ్రమ్మ ప్రాణాలు విడిచింది.