టాలీవుడ్ స్టార్, బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ను టార్గెట్ చేస్తూ గత కొద్దిరోజులుగా నెటిజన్లు సోషల్‌మీడియాలో అసభ్యకరమైన రీతిలో రచ్చ చేస్తున్న సంగతి విదితమే. దీనిపై మండిపడ్డ యాంకర్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయినప్పటికీ వెనక్కు తగ్గని నెటిజన్లు మరింతగా ఆంటీ అంటూ వేలకొద్దీ ట్వీట్లు చేసి అసభ్యపదజాలాలు వాడారు. దీనిపై తాజాగా అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
